
వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే మార్కెట్లో లభించే చాలా ఉత్పత్తులలో రసాయనాలు ఉంటాయి. అవి తక్షణ మెరుపును ఇవ్వవచ్చు.. కానీ దీర్ఘకాలిక నష్టాన్ని కూడా కలిగిస్తాయి. ఎక్కువ రసాయన ఉత్పత్తులను వాడటం వల్ల చర్మం మెరుపు తగ్గుతుంది. ఇతర చర్మ సమస్యలు పెరుగుతాయి. కనుక సహజ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించాలి. ముల్తానీ మట్టి మన అమ్మమ్మల కాలం నుంచి వాడుకలో ఉంది. నేటికీ ప్రజలు ముల్తానీ మట్టిని వాడుతున్నారు. ఇది చర్మంలోని నూనెను నియంత్రించి ముఖంపై మెరుపు ఉండేలా చేస్తుంది.
ముల్తానీ మిట్టిలో ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖం మీద పిగ్మెంటేషన్, మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి, అయితే ముల్తానీ మిట్టిలో కొన్నిటిని కలిపి అప్లై చేస్తే రెట్టింపు ప్రయోజనాలను పొందుతారు. కనుక ఈ రోజు ముల్తానీ మట్టితో వేటిని కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయాలి? ఎలా చేయాలి? ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ముల్తానీ మట్టితో చర్మానికి మెరుపు
ముల్తానీ మట్టి క్లెన్సర్ .. ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజూ వాడటం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. అదనపు నూనెను తగ్గిస్తుంది. చర్మం మీద మృతకణాలను తగ్గిస్తుంది. మొటిమలను కూడా తగ్గిస్తుంది. చర్మం మెరుపు చెక్కుచెదరకుండా ఉంటుంది.
ముల్తానీ మట్టి బంగాళదుంప రసం
ముల్తానీ మట్టి, బంగాళాదుంప రసం చర్మానికి మేలు చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి బంగాళాదుంపను తురిమి రసం తీసి.. ఆ రసం లో ముల్తానీ మిట్టిని కలపండి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి, 15-20 నిమిషాలు ఉండి ఆపై చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వలన చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా మారుతుంది.
ముల్తానీ మిట్టి టమోటా రసం
ముల్తానీ మట్టితో టమోటా రసం కలిపి అప్లై చేయడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. టమాటో రసం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది, ముల్తానీ మిట్టి చర్మం నుంచి అదనపు నూనె, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమం టానింగ్‌ను కూడా తొలగిస్తుంది. ముఖంపై మెరుపు చెక్కుచెదరకుండా ఉంటుంది.
ముల్తానీ మట్టి నిమ్మరసం
ముల్తానీ మట్టి .. నిమ్మరసం చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేయడం వల్ల టానింగ్, మొటిమలు తొలగిపోతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మం మెరుపును కాపాడుకునేందుకు ఈ వంటింటి చిట్కాలను పాటించాలి. ఇవి వేసవి కాలంలో టానింగ్, పొడిబారడం, మచ్చలు, మొటిమలు వంటి అన్ని చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి. ముఖం మచ్చ లేకుండా చంద్ర బింబంలా కనిపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)