Maharashtra: మహారాష్ట్రలోని షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయానికి శ్రీరామ నవమి సందర్భంగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ నెల 5 నుండి 7 వరకు జరిగిన శ్రీ రామ నవమి ఉత్సవాల్లో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (SSST) మొత్తం రూ. 4.26 కోట్ల విరాళాలను సేకరించింది. వచ్చిన మొత్తం విరాళాల్లో రూ. 1.67 కోట్లు నగదు రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో రూ. 79.38 లక్షలు విరాళ కౌంటర్ల ద్వారా రాగా రూ. 47.16 లక్షలు పెయిడ్ దర్శన పాస్‌ల ద్వారా వచ్చాయి. వీటితో పాటు రూ. 6.15 లక్షల విలువైన 83 గ్రాముల బంగారం, రూ. 1.31 లక్షల విలువైన 2 కిలోల వెండి కానుకలు అందాయి. అయితే ఈ శ్రీరామ నవమి సందర్భంగా కేవలం మూడు రోజుల్లోనే 2.5 లక్షలకు పైగా భక్తులు షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..