Shamshabad Drug Bust & Secunderabad Ganja Seizure: Police Crack Down on Drug Trafficking

Written by RAJU

Published on:

  • డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆర్జీఐఏ పోలీసులు
  • సికింద్రాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు
  • ఇద్దరు నిందితులను అరెస్ట్
Shamshabad Drug Bust & Secunderabad Ganja Seizure: Police Crack Down on Drug Trafficking

అహ్మద్ నగర్ మహారాష్ట్రాకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్‌ లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు గతంలో మహారాష్ట్ర లో కిరాణా షాపుతోపాటు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బెంగళూరుకు మఖాం మార్చాడు. అక్కడ ఆన్ లైన్ లో డ్రగ్స్ కు సంబంధించి సెర్చింగ్ చేశాడు. దీంతో అతనికి నైజీరియన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. నైజీరియన్ వ్యక్తి ద్వారా ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి అతను తీసుకునేవాడు. కొన్నాళ్లు గడిచిన తర్వాత దానిని ఇతరులకు విక్రయించేవాడు. అదే తరహాలో శంషాబాద్ లో ఎండిఎం ఏ డ్రగ్స్ ను సినిమా థియేటర్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఆర్జీఐఏ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుని వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ ఎండి ఎంఎం డ్రగ్స్ విలువ లక్ష 80 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు.

సికింద్రాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు

అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు రైల్వే పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 28.50లక్షల విలువైన 57కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వస్టేషన్ లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు లో ఒరిస్సా బర్హంపుర నుండి మహారాష్ట్ర లోని దాదర్ కు కు తరలిస్తున్న ఒరిస్సా కు చెందిన సుశాంత్ కుమార్ స్వేన్, మహారాష్ట్రకు చెందిన కరణ్ ఇయప్పన్ శెట్టి పట్టుబడినట్లు జీఆర్పీ డీఎస్పీ ఎస్ ఎన్ జావేద్ తెలిపారు. ప్రధాన నిందితుడు ఒరిస్సా కు చెందిన జీవన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. చెడు వ్యసనాల కారణంగా అప్పుల పాలైన సుశాంత్, కారు డ్రైవింగ్ వలన వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని అధిక సంపాదన కోసం పార్ట్ టైమ్ జాబ్ కోసం వెతుకుతున్న కరణ్ ల అవసరాలను ఆసరాగా చేసుకొని వారికి అధిక ఆదాయం సమకూరుస్తానని ఆశ చూపి బరంపురకు పిలిపించుకున్నాడు. అక్కడ గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో అమ్మడం ద్వారా ముగ్గురం సమానంగా పంచుకుందామని ఒప్పందం చేసుకున్నారు. గంజాయి బ్యాగ్ లను తమ సీట్ల కింద పెట్టుకొని పెట్టుకొని నిద్ర పొగా మధ్యలోనే జీవన్ అదృశ్యమయ్యాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్ లో వీరు తమకు పట్టుబడ్డట్లు డీఎస్పీ వివరించారు. వీరినుండి 28.50లక్షల విలువైన గంజయితో పాటు 4సెల్ పోన్ లు స్వాధీనం చేసుకోని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.

Subscribe for notification