ABN
, Publish Date – Apr 18 , 2025 | 01:35 AM
ఎన్‌ఎస్ఈ ఐపీఓ అనుమతిలో వాణిజ్య ప్రయోజనాల కంటే వాటాదారుల ప్రయోజనాలే ముఖ్యమని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ఎన్‌ఎ్‌సఈని ఇప్పటికే ఆదేశించామని తెలిపారు.

ముంబై: ఎన్‌ఎస్ఈ ఐపీఓకు అనుమతిలో తమకు వాణిజ్య ప్రయోజనాల కంటే, వాటాదారుల ప్రయోజనాలే ముఖ్యమని సెబీ స్పష్టం చేసింది. ఈ విషయంలో వాటాదారుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై సీఐఐ నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన ఆయన విలేకరులతో ఈ విషయం స్పష్టం చేశారు. స్టాక్ ఎక్స్చేంజిల మధ్య తలెత్తే వివాదాల పరిష్కార బాధ్యత కూడా తమదేనన్నారు. ఎన్‌ఎ్‌సఈ ఐపీఓకు ఎప్పటిలోగా అనుమతి ఇస్తారన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. అయితే త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని సెబీ చీఫ్ చెప్పారు. మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు నష్టపరిహారం, క్లియరింగ్ కార్పొరేషన్ ఈక్విటీలో మెజారిటీవాటా ఉండడం ఎన్‌ఎస్ఈ ఐపీఓకు ప్రతిబంధకంగా మారాయి. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించుకుని రావాలని సెబీ ఇప్పటికే ఎన్‌ఎ్‌సఈ మేనేజ్‌మెంట్‌ను కోరింది.
Updated Date – Apr 18 , 2025 | 01:38 AM