Scholar Kills Classmate In Tamil Nadu Faculty

Written by RAJU

Published on:

  • తమిళనాడులో విద్యార్థుల మధ్య పెన్సిల్ గొడవ..
  • తోటి విద్యార్థిని కొడవలితో నరికి చింపేసిన మరో స్టూడెంట్..
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు..
Scholar Kills Classmate In Tamil Nadu Faculty

Student Kills Classmate: తమిళనాడులో పెన్సిల్ గొడవ పెను సంచలనంగా మారింది. పెన్సిల్ కోసం 8వ తరగతి చదువుతున్న స్నేహితుల మధ్య గొడవ‌‌‌‌ జరిగింది. పెన్సిల్ వివాదంతో తోటి విద్యార్థిని మరో స్నేహితుడు కొడవలితో నరికి చంపేశాడు. ఇక, అడ్డు వచ్చిన ఉపాధ్యాయుడికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. విద్యార్థి పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తిరునల్వేలి పాలయంగోట్టైలో స్కూల్ ఈ ఘటన‌‌‌‌‌‌ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read Also: Secunderabad: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్ లో 100 రోజుల పాటు ప్లాట్ఫామ్స్ క్లోజ్

అయితే, తిరునల్వేలి పాలయంగోట్టై స్కూల్ లో పెన్సిల్ గొడవతో ఇద్దరు స్నేహితులు గత నెల రోజులుగా మాట్లాడుకోకుండా ఉన్నారు. ఇక, ఈ రోజు మళ్ళీ పెన్సిల్ కోసం గొడవ జరగడంతో వెంట తెచ్చుకున్న కొడవలితో నరికేశాడు విద్యార్థి. కాగా, సంఘటన ప్రదేశానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించి.. విద్యార్థిని అదుపులోకి తీసుకుని.. జువైనల్ కోర్టుకు తరలించారు. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని పోర్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights