ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడి ఎంపికగా విస్తృతంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ రిస్క్, అధిక-రిటర్న్ పథకాలను కోరుకునే సీనియర్ సిటిజన్లు పెట్టుబడిపై ఆసక్తి చూపుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే అమృత్ కలాష్ ఎఫ్‌డీ స్కీమ్ నిర్ణీత కాలానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం అనేది మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉండే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకంగా ఉంది.
ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం సాధారణ పెట్టుబడిదారులకు సంవత్సరానికి 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం పదవీ విరమణ చేసిన వారికి, స్థిరమైన ఆదాయ మార్గాన్ని కోరుకునే వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్‌లో రూ. లక్ష పెట్టుబడిపై, సాధారణ పెట్టుబడిదారులు 400 రోజుల వ్యవధిలో రూ. 7,100 వడ్డీని అందిస్తుంది. మరోవైపు సీనియర్ సిటిజన్లు రూ. 7,600 వరకు వస్తుంది. రూ. 10 లక్షల పెద్ద పెట్టుబడి సాధారణ పెట్టుబడిదారులకు రూ. 5,916, సీనియర్ సిటిజన్లకు రూ. 6,333 నెలవారీ వడ్డీ ఆదాయాన్ని ఇస్తుంది.
ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం గడువును అనేకసార్లు పొడిగించింది. ప్రస్తుత గడువు, మార్చి 31 2025గా ఉంది. ఇకపై ఈ స్కీమ్‌పై ఎలాంటి పొడిగింపు ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకం సౌకర్యవంతమైన వడ్డీ చెల్లింపు ఎంపికలను అందిస్తుంది. నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక లెక్కన వడ్డీ చెల్లిస్తారు. అలాగే రాబడిపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ తగ్గించిన తర్వాత పెట్టుబడిదారుడి బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎస్‌బీఐ యోనో బ్యాంకింగ్ యాప్ ద్వారా లేదా వారి సమీపంలోని SBI శాఖను సందర్శించడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం ఆకర్షణీయమైన రాబడితో సురక్షితమైన పెట్టుబడి మార్గాన్ని అందిస్తున్నప్పటికీ పెట్టుబడి పెట్టే ముందు అన్ని స్కీమ్ సంబంధిత పత్రాలను జాగ్రత్తగా సమీక్షించడం చాలా అవసరం. ఏదైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుని లేదా సంబంధిత బ్యాంకును సంప్రదించడం చాలా మంచిది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి