SBI: ఎస్‌బీఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌.. యువతకు మంచి ఆఫర్, రూ.70 వేలు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 19 , 2024 | 12:26 PM

డిగ్రీ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 12వ బ్యాచ్‌ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకు రూ.70 వేల వరకు అందిస్తుంది.

SBI: ఎస్‌బీఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌.. యువతకు మంచి ఆఫర్, రూ.70 వేలు

డిగ్రీ పాసైన విద్యార్థులకు(students) గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 12వ బ్యాచ్‌ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకు రూ.70 వేల వరకు అందిస్తుంది. అయితే ఈ ప్రొగ్రామ్ కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వయసు పరిమితి ఎంత వంటి వివరాలను ఇక్కడ చుద్దాం.

దీని కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అర్హత ఉన్న అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వీటి కోసం ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌లో (Youthforindia.org) దరఖాస్తు చేయాలి. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలిచి ఫైనల్ చేస్తారు. ఆ క్రమంలో అభ్యర్థులు తర్వాత ఆఫర్ లెటర్‌ను అందుకుంటారు. ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత, వారు ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌కు హాజరు కావాలి. ఆ తర్వాత ఫెలోషిప్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

  • ముందుగా Youthforindia.org అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

  • హోమ్ పేజీలో “SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్” లింక్‌పై క్లిక్ చేయండి

  • కొత్త పేజీలో సమాచారం ఉంటుంది, మొత్తం సమాచారాన్ని ఫిల్ చేయండి

  • దీని తర్వాత అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి

  • దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్ లోడ్ చేసుకుని మీ వద్ద ఉంచుకోండి

ఈ ఫెలోషిప్‌ను SBI గ్రూప్ CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగం ప్రారంభించింది. ఇది ఫెలోషిప్ ప్రోగ్రామ్ 12వ బ్యాచ్ రిక్రూట్‌మెంట్. ప్రోగ్రామ్ మొత్తం వ్యవధి 13 నెలలు. ఇందులో ఎంపికైన అభ్యర్థులందరికీ దేశంలోని 13 ప్రఖ్యాత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ (NGOలు)తో కలిసి పనిచేసే సువర్ణావకాశం లభిస్తుంది. SBI ఫెలోషిప్ 13 మే 2024న ప్రారంభించబడుతుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Delhi: నాలుగోసారి చెత్త రికార్డును దక్కించుకున్న ఢిల్లీ

Updated Date – Mar 19 , 2024 | 12:26 PM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights