Saweety Boora and Deepak Hooda’s Dispute Escalates with Severe Allegations

Written by RAJU

Published on:

  • స్వీటీ బోరా, దీపక్ హుడా మధ్య పెరుగుతున్న వివాదం
  • ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు
  • భర్త దీపక్ హుడాపై భార్య తీవ్ర ఆరోపణలు
  • దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి- భార్య స్వీటీ.
Saweety Boora and Deepak Hooda’s Dispute Escalates with Severe Allegations

మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బోరా, ఆమె భర్త దీపక్ హుడా మధ్య వివాదం మరింత పెరుగుతోంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకున్న తర్వాత ఈ వివాదం ఎక్కువైంది. నిన్న పోలీస్ స్టేషన్‌లో తన భర్త దీపక్ నివాస్ హుడాతో.. భార్య స్వీటీ బోరా మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇంతలోనే భార్య స్వీటీ బోరా మరో బాంబ్ పేల్చింది. భర్త దీపక్ హుడాపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి ఉందని స్వీటీ చెప్పింది. ఈ విషయం తనకు తరువాత తెలిసిందని చెప్పింది.

Read Also: Mad Square: మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ విడుదల వాయిదా

ఇన్‌స్టాలో స్వీటీ బోరా ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. తన భర్త నుండి విడాకులు అడిగింది. “నేను అతని నుండి విడాకులు అడుగుతున్నాను.. ఒక వ్యక్తి అంత చెడ్డవాడైతే అతనితో ఎందుకు జీవించాలని కోరుకుంటారు..?” అని స్వీటీ బోరా తెలిపింది. “ఎవరైనా మంచిగా ఉంటేనే కలిసి ఉండాలని కోరుకుంటారు. నేను ఆస్తిని లేదా డబ్బును అడగలేదు. నా డబ్బు తిన్న వ్యక్తిని నేను ఏం అడగడం లేదు. నాకు విడాకులు ఇవ్వమని చెప్పాను. నాకు ఇంకేమీ వద్దు.” అని భార్య స్వీటీ బోరా తెలిపింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో తన భర్త దీపక్ హుడాను కొట్టిన వీడియోపై స్వీటీ బోరా వివరణ ఇస్తూ.. వీడియోలోని ప్రారంభం, ముగింపు మిస్ అయ్యాయని పేర్కొంది. “దీపక్ నన్ను దారుణంగా వేధిస్తున్నాడు. నన్ను ఉద్దేశపూర్వకంగా చెడుగా చిత్రీకరిస్తున్నాడు. దీపక్ హుడా నన్ను కొట్టేవాడు” అని తెలిపింది. మరోవైపు.. ఈ కేసులో హిసార్ ఎస్పీతో దీపక్ హుడా కుమ్మక్కయ్యారని.. వీడియోను వక్రీకరించారని ఆమె ఆరోపించింది.

Read Also: David Warner : డేవిడ్ వార్నర్ కు తెలుగు నేర్పిస్తున్న శ్రీలీల, నితిన్.. నవ్వులే నవ్వులు..

స్వీటీ బోరా తెలిపిన వివరాల ప్రకారం.. వీడియోలో ఘటనకు ముందు, తర్వాత జరిగిన సంభాషణలు లేవని చెప్పింది. దీపక్ తన తండ్రి, మామ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో రాశాడని, ఆ పేర్లు తప్పుగా రాసినట్లు వెల్లడించింది. దీపక్ తన తండ్రి, మామ పేర్లను ఎఫ్ఐఆర్‌లో రాసి తప్పుడు వైద్య నివేదికను తయారు చేశాడని స్వీటీ చెప్పింది. కాగా.. స్వీటీ బోరా, దీపక్ నివాస్ హుడా.. 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. స్వీటీ తన భర్త దీపక్ తనను కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వివాహంలో రూ. కోటి, ఫార్చ్యూనర్ ఇచ్చినప్పటికీ.. తక్కువ కట్నం కోసం తనను వేధించారని ఆమె చెప్పింది. మరోవైప.. దీపక్ కూడా స్వీటీ, ఆమె కుటుంబం తన ఆస్తిని ఆక్రమించుకున్నారని.. చంపేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చాడు. తాను నిద్రపోతున్నప్పుడు స్వీటీ తల పగలగొట్టిందని, కత్తితో దాడి చేసిందని దీపక్ చెప్పాడు. ఇద్దరి ఫిర్యాదులపై హిసార్, రోహ్తక్‌లలో క్రాస్ కేసులు నమోదయ్యాయి.

Subscribe for notification