sant kabirnagar man arranges spouse wedding ceremony to her lover

Written by RAJU

Published on:

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన
  • స్థానికంగా చర్చనీయాంశమైన ఘటన
  • భర్యను తిట్టిపోస్తున్న జనాలు
sant kabirnagar man arranges spouse wedding ceremony to her lover

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను, భర్తను విడిచిపెట్టి తన ప్రేమికుడితో వివాహం చేసుకుంది. ఈ ఘటనలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఈ వివాహం ఆ మహిళ భర్త చేతుల మీదుగా జరిగింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సంత్ కబీర్ నగర్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ధన్‌ఘాటా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కతర్ జోట్ గ్రామానికి చెందిన కల్లు కుమారుడు బబ్లు, 2017 సంవత్సరంలో గోరఖ్‌పూర్ జిల్లాలోని భూలాంచక్ గ్రామానికి చెందిన తౌలి రామ్ కుమార్తె రాధికను వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. వారి ఎనిమిది సంవత్సరాల వివాహ జీవితంలో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పెద్ద కొడుకు ఏడేళ్ల ఆర్యన్, కూతురు రెండేళ్ల శివాని.

READ MORE: France: వైమానిక విన్యాసాల్లో అపశృతి.. 2 విమానాలు ఢీ.. ముగ్గురికి సీరియస్

బబ్లూ తరచుగా జీవనోపాధి కోసం ఇంటి బయటే ఉండేవాడు. రాధిక గ్రామంలోని ఒక యువకుడితో సంబంధం పెట్టుకుంది. వీరి సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. ఈ సంబంధం కాస్త గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే, వారు బబ్లుకు చెప్పారు. బబ్లు ఈ విషయమై రాధికతో చర్చించాడు. ఆమెకు నచ్చజెప్పేందుకు యత్నించాడు. ఆ మహిళ ప్రియుడి కోసం తన పిల్లలను విడిచిపెట్టడానికి అంగీకరించింది. ప్రియుడే కావాలని పట్టుబట్టింది. పిల్లల్ని తానే పెంచుతాను చెప్పాడు. గ్రామ పెద్దల ముందుకు రాధిక, ఆమె ప్రియుడికి వివాహం చేశాడు. ఈ ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ వార్త విన్న ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆ మహిళను తీవ్రంగా దూషిస్తున్నారు. ఇద్దరు పిల్లలను వదిలి ప్రియుడి కోసం పరితపించిన ఆమెను తిట్టి పోస్తున్నారు.

Subscribe for notification