Samsung Galaxy Book-5 Series: భారత్‌లో అందుబాటులో గెలాక్సీ బుక్-5 సిరీస్ ల్యాప్‌టాప్స్.. టాప్ రేపుతున్న ఫీచర్లు – Telugu News | Galaxy Book 5 series laptops available in India, with Top notch features, Samsung Galaxy Book 5 Series details in telugu

Written by RAJU

Published on:

సామ్‌సంగ్ ప్రియులు ఎన్నో రోజులు నుంచి ఎదురుచూస్తున్న గెలాక్సీ బుక్-5 సిరీస్ ల్యాప్‌టాప్స్‌ను ఆ కంపెనీ ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ చేసింది. లేటెస్ట్ గెలాక్సీ బుక్ సిరీస్ ల్యాప్‌టాప్స్‌లో గెలాక్సీ బుక్-5 ప్రో, గెలాక్సీ బుక్-5 ప్రో 360, గెలాక్సీ బుక్-5 360 వేరియంట్స్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.  ఈ ల్యాప్‌టాప్‌లో ఏఐ ఆధారిత ఫీచర్స్ కోసం కోసం 47 టీఓపీఎస్ వరకు ఇచ్చే ఎన్‌పీయూతో కూడిన తాజా ఇంటెల్ కోర్ అల్ట్రా సీపీయూ (సిరీస్ 2) గెలాక్సీ బుక్ 5 సిరీస్‌లో ఉన్నాయి. కోపైలట్ ప్లస్ పీసీల్లో 3కే వరకు రిజల్యూషన్ ఎమోఎల్ఈడీ స్క్రీన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు ఒకే ఛార్జ్‌పై 25 గంటల వరకు పని చేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

గెలాక్సీ బుక్-5 ప్రో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3కే రిజల్యూషన్‌తో 14 అంగుళాల ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. గెలాక్సీ బుక్-5 360 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుండగా గెలాక్సీ బుక్-5 ప్రో 360 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 16 అంగుళాల ఎమోఎల్ఈడీ 3కే డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ బుక్-5 సిరీస్ ల్యాప్‌టాప్స్‌ ఐ5 లేదా ఐ 7 అల్ట్రా ప్రాసెసర్‌లను అందిస్తోంది. ఈ మూడు వెర్షన్‌లు 16 జీబీ +256 జీబీ, 32 జీబీ + 512 జీబీ, 1 టీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త గెలాక్సీ బుక్ 5 సిరీస్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్, క్విక్ షేర్, మల్టీ-కంట్రోల్ వంటి అనేక ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఇవి గెలాక్సీ ఏఐ సూట్‌తో పాటు సజావుగా మల్టీ సిస్టమ్ కమ్యూనికేషన్‌ను అనుమతిస్తాయి. 

గెలాక్సీ బుక్-5 ప్రో ల్యాప్‌టాప్స్‌లో 360 స్టీరియో స్పీకర్లు ఆకర్షిస్తున్నాయి. గెలాక్సీ బుక్ 5 ప్రో, ప్రో 360 క్వాడ్ స్పీకర్లను కలిగి ఉన్నాయి. మెరుగైన ఆడియో అనుభవం కోసం అన్ని మోడళ్లు డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తాయి. అదనంగా ప్రతి వేరియంట్‌లో అధిక నాణ్యత వీడియో కాల్‌ల కోసం 2 ఎంపీ ఫుల్ హెచ్‌డీ  వెబ్‌క్యామ్ ఉంటుంది. గెలాక్సీ బుక్-5 5 360 ధర రూ.1,14,990 నుంచి ప్రారంభమవుతుంది. అయితే గెలాక్సీ బుక్-5 ప్రో, గెలాక్సీ బుక్-5 ప్రో 360 ధర వరుసగా రూ.1,31,990 మరియు రూ.1,55,990గా ఉన్నాయి. ఈ మూడు మోడళ్లు సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సామ్‌సంగ్ ఇండియా స్మార్ట్ కేఫ్స్‌తో పాటు అధీకృత రిటైల్ స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్స్ మార్చి 20, 2025 నుంచి వినియోగాదారులకు అందుబాటులో ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification