Sajjanar: వాటి జోలికి వెళ్తే రంగు పడుద్ది.. పోలీస్ సింగం స్ట్రాంగ్ వార్నింగ్.. – Telugu News | Sajjanar rings alarm bells on online betting in Telangana

Written by RAJU

Published on:

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్‌ చేస్తే రంగు పడుద్ది. యస్‌. పోలీస్‌ సింగం వార్నింగ్‌ ఇది. భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ…బెట్టింగు జోలికి వెళ్లకుండా ఉండడం బెటరూ అంటూ సలహా ఇస్తున్నారు మన ఖాకీ సింగం. ఆయన యూనిఫామ్‌లో ఉన్నా, లేకున్నా, సమాజ హితమే తన అభిమతం అంటూ ముందుకు సాగుతున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ భరతం పడుతున్నారు.

ఇటీవల కాలంలో ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్… తనదైన శైలిలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌ని లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. తన ట్వీట్లకు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ట్యాగ్‌ చేసి పోలీసులను అలర్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు తగిన బుద్ధి చెబుతున్నారు. దీంతో వైజాగ్‌ పోలీసులు లోకల్‌ బాయ్‌ నానీని అరెస్ట్‌ చేసి లోపలేశారు. అలాగే సూర్యాపేటకు చెందిన భయ్యా సన్నీ యాదవ్‌కి కూడా పోలీస్ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు.

సజ్జనార్‌ చొరవతో పోలీసులు బెట్టింగ్ యాప్‌లపై సీరియస్‌గా దృష్టి సారించడంతో…తెలుగు రాష్ట్రాల్లోని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌…. తమ సోషల్ మీడియా ఖాతాల్లోని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగులపై ఓ కన్నెయ్యాలని పోలీసులను నెటిజన్లు కోరుతున్నారు. ఇక బెట్టింగ్‌ భూతం వల్ల చాలామంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. బెట్టింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలంటున్నారు సీనియర్ ఐపీఎస్ సజ్జనార్‌.

Subscribe for notification