Sainik College Entrance Examination 2025: మరో వారంలో ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డ్స్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

Written by RAJU

Published on:

హైదరాబాద్, మార్చి 28: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (AISSEE) 2025 ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్ష ద్వారా ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎంఆర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్ష హాల్‌ టికెట్స్‌ కూడా విడుదలయ్యాయి. విద్యార్థులు తమ అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 5న నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్‌టీఏ) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.

ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ అడ్మిట్‌ కార్డ్స్ 2025 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

‘175 నియోజకవర్గాల్లోనూ జాబ్‌ మేళాలు అప్పటిలోగా నిర్వహించండి’.. సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో త్వరలో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సులోగా జాబ్‌ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏడాదికి ప్రతి మూడు, ఆరు నెలలకొకసారైనా జాబ్‌ మేళాలు జరగాలని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నాయిని, ఇంకా నైపుణ్య గణన పూర్తికాకపోవడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. అందుకు ప్రతి జోన్‌కు ఒక ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీని నోడల్‌ ఏజెన్సీగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

నైపుణ్యాల పెంపుకు దరఖాస్తు చేసుకున్న వారికి స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వర్క్‌ ఫ్రం హోం విధానంలో పని చేసేందుకు కూడా అవకాశం ఇస్తామని, ఆ మేరకు నమోదు చేసుకున్నవారికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆదేశించారు. అయితే క్లస్టర్‌ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని, నియోజకవర్గాల్లో మూడు నెలలకోసారి జాబ్‌ మేళాలు నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights