Saffron Milk: వేడి వేడి పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

Written by RAJU

Published on:

Saffron Milk: వేడి వేడి పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

వివిధ రకాల సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు చాలా ఖరీదైంది. ఇది రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. కుంకుమ పూవు వాసన కొద్దిగా తీయగా, ఘాటుగా ఉంటుంది. కొద్దిగా చేదు కూడా ఉంటుంది. ఇందులో కేలరీలతో పాటు ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే చాలా మంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, కుంకుమ పువ్వు కలిపేందుకు వేడి పాలు తీసుకోవాలా..? లేదంటే చల్లటి పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే ఏమౌతుందో తెలుసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. వేసవిలో కుంకుమ పాలు తాగవచ్చా లేదా అనేది తెలుసుకుందాం

కుంకుమ పువ్వు పాలతో పోషక విలువలు పెరుగుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. శరీరానికి అంతర్గతంగా బలం చేకూరుతుందని చెబుతారు. కుంకుమ పువ్వు చర్మ సంరక్షణకు చాలా మంచిది. పాలలో కలుపుకుని తాగుతుంటారు. జలుబు దగ్గు సమస్య ఉంటే వేసవిలో కూడా కుంకుమ పాలు తాగవచ్చు. అయితే కుంకుమ పువ్వును ఎప్పుడూ చల్లనిపాలలోనే కలిపి తాగాలి. వేడి పాలలో కలిపి తాగితే ఎసిడిటీ సమస్య రావచ్చు

రాత్రి వేళ పాలు జీర్ణమవడం కష్టం. అందుకే ఉదయం వేళ తాగితే మంచిది. మీ శరీర స్వభావాన్ని బట్టి ఎప్పుడు తాగాలా నిర్ణయించుకోవచ్చు. చల్లని పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే చర్మంపై నిగారింపు వస్తుంది. మెదడుకు కూడా మంచిది. తరచూ ఇలా కుంకుమ పువ్వు పాలు తీసుకోవటం వల్ల శరీరానికి చలువచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వేడి పాలలో కుంకుమ పూలు కలిపి తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కాస్త గోరువెచ్చగా, లేదంటే చల్లటి పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights