RRB NTPC 2025 Expected Date : ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
హైలైట్:
- ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్ 2025
- మొత్తం 11,558 ఖాళీల భర్తీకి ప్రకటన
- మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్షలు?
- త్వరలో అధికారిక ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో.. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టలు ఉన్నాయి. ఈ కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలకు లెవెల్-3 జీతం చెల్లిస్తారు. వీరికి రూ.21,700 మూల వేతనం ఉంటుంది. అన్నీ కలిపి సుమారు రూ.40,000 అందుకోవచ్చు. మిగిలినవి లెవెల్-2 ఉద్యోగాలు. వీటికి రూ.19,900 మూల వేతనం ఉంటుంది. అన్నీ కలిపి మొదటి నెల నుంచే సుమారు రూ.36,000 అందుకోవచ్చు. ఇక ఈ ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీలను త్వరలో వెల్లడించనున్నారు.
RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025 : CBT 1 పరీక్షా విధానం:
CBT మొదటి దశ మూడు విభాగాలలో ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్. 100 ప్రశ్నలు మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 90 నిమిషాలు.
- జనరల్ అవేర్‌నెస్: 40 ప్రశ్నలు – 40 మార్కులు.
- గణితం: 30 ప్రశ్నలు – 30 మార్కులు.
- జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్: 30 ప్రశ్నలు – 30 మార్కులు.
RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025 CBT 2 పరీక్షా విధానం :
రెండవ దశ CBT కూడా 3 విభాగాలను కలిగి ఉంటుంది. 120 మార్కులకు 120 ప్రశ్నలతో ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 90 నిమిషాలు. CBT 1, CBT 2 పరీక్షలలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
- జనరల్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు – 50 మార్కులు.
- గణితం: 35 ప్రశ్నలు – 35 మార్కులు.
- జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్: 35 ప్రశ్నలు – 35 మార్కులు.