హైదరాబాద్, మార్చి 20: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) లోకో పైలట్ సీబీటీ 2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 19వ తేదీ రెండు షిఫ్ట్‌లలో ఈ పరీక్ష జరగవల్సి ఉంది. కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దీని కారణంగా పరీక్ష నిర్వహించలేక పోతున్నట్లు వెల్లడించింది. పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేసిన త్వరలో ప్రకటిస్తామని అభ్యర్థులకు తెలిపింది. అలాగే మార్చి 20వ తేదీ మొదటి షిఫ్ట్‌లో జరగాల్సిన పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో వెల్లడించింది. ఇతర అప్‌డేట్ల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని సూచించింది.
ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ ఫలితాలు విడుదల.. కట్‌ఆఫ్ ఎంతంటే?
వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఫలితాలతో పాటు కట్‌ఆఫ్ మార్కులను కూడా జారీ చేసింది. మొత్తం 1,699 అభ్యర్థులు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికయ్యారు. కాగా గత ఏడాది డిసెంబర్ 20వ తేదీ నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరిగాయి. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇటీవలే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఫలితాలు కూడా విడుదలయ్యాయి.
ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మార్చి 21 వరకు ఎన్‌టీఏ- జిప్‌మ్యాట్ 2025 కరెక్షన్ విండో ఓపెన్
2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్ములో ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం)లో ప్రవేశాలకు నిర్వహించనున్న జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) 2025 దరఖాస్తులో సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అవకాశం కల్పించింది. ఈమేరకు అభ్యర్థులు మార్చి 21 వరకు తమ దరఖాస్తులోని తప్పులను సవరణ చేసుకోవచ్చని తెల్పింది. ఏప్రిల్ 26న రాత పరీక్ష నిర్వహించనున్నారు.
జిప్‌మ్యాట్ 2025 కరెక్షన్ విండో కోసం ఇక్కగ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.