RRB Exam Dates 2025 : రైల్వేశాఖలో 26,750 ఉద్యోగాలు.. ALP JE పరీక్షల షెడ్యూల్‌ వెల్లడి

Written by RAJU

Published on:

RRB ALP CBT 2 Exam Dates 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) కీలక ప్రకటన చేసింది. పలు ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..

హైలైట్:

  • ఆర్‌ఆర్‌బీ ఎగ్జామ్‌ డేట్స్‌ 2025 విడుదల
  • ఏఎల్‌పీ, జేఈ ఇతర పరీక్ష తేదీలు వెల్లడి
  • మార్చి 19, 20 తేదీల్లో ఎగ్జామ్స్‌ నిర్వహణ

Samayam Teluguఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ జేఈ ఎగ్జామ్‌ డేట్స్‌ 2025
ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ జేఈ ఎగ్జామ్‌ డేట్స్‌ 2025

RRB ALP CBT 2 JE Exam Dates 2025 : రైల్వే శాఖ (Indian Railway) ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (Assistant Loco Pilot), జూనియర్‌ ఇంజినీర్‌ (Junior Engineer), మెటీరియల్‌ సూపరిటెండెంట్‌, కెమికల్‌ అండ్‌ మెటలార్జికల్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ సూపర్‌వైజర్‌, మెటలార్జికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు సంబంధించి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (RRB ALP CBT 2 Exam Dates 2025) తేదీలను వెల్లడించింది. మార్చి 19, 20వ తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష సెంటర్‌ వివరాలను పరీక్ష తేదీకి 10 రోజుల ముందు.. అడ్మిట్‌ కార్డులను నాలుగు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

రైల్వేలో 18,799 ఏఎల్‌పీ ఉద్యోగాలు

ఇండియన్‌ రైల్వే ఉద్యోగాల భర్తీ కమ్రంలో ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (Assistant Loco Pilot) నియామక రాత పరీక్షకు సంబంధించిన CBT 1 ఫలితాలు త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదల చేశారు. RRB ALP 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, యూజర్‌ పాస్‌వర్డ్/ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి రిజల్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఫలితాల కోసం ఎప్పటికప్పుడు https://www.rrbcdg.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకుంటూ ఉండొచ్చు.

Indian Railway ఆర్‌ఆర్‌బీ ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే జోన్లలో 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (Assistant Loco Pilot) ఉద్యోగాలను భర్తీ కోసం 2024 జనవరి నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్షలు (సీబీటీ 1) నవంబర్‌ 25, 26, 27, 28, 29 తేదీల్లో నిర్వహించారు. ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ, జేఈ ఎగ్జామ్‌ డేట్స్‌ అధికారిక ప్రకటన

RRB Exam Dates 2025

RRB JE : రైల్వే శాఖ 7951 ఉద్యోగాలు

భారతీయ రైల్వే (Indian Railway) ఆయా విభాగాల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసిన యువతకు సువర్ణావకాశం కల్పిస్తూ.. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి గత ఏడాది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. రెండు దశల పరీక్షల అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. తాజాగా ఆర్‌ఆర్‌బీ పరీక్ష తేదీలను ప్రకటించింది. పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification