హైదరాబాద్, మార్చి 29: రైల్వే శాఖలో పలు నియామక పరీక్షల తేదీనలు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి సీబీటీ 2 పరీక్షను ఏప్రిల్ 22వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇటీవలే ఈ పోస్టులకు నిర్వహించిన ఆన్‌లైన్ రాత పరీక్ష సీబీటీ 1 ఫలితాలను విడుదల చేయగా సీబీటీ 2 పరీక్షకు దాదాపు 20,792 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు. అభ్యర్ధుల రోల్ నంబర్‌తో ఉన్న వివరాలను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 03/ 2024) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా మొత్తం 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ తదితర ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఆర్‌ఆర్‌బీ జేఈ రైల్వే పరీక్షల 2025 షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ఏపీపీఎస్సీ రాత పరీక్షలు పూర్తి.. త్వరలోనే ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలు ముగిసినట్లు ఏపీపీఎస్సీ మార్చి 27 (శనివారం) ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిలో గ్రంథపాలకులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ఎనలిస్టు గ్రేడ్ 2 పోస్టులు, విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయని చెప్పింది. మార్చి 24 నుంచి 27వ తేదీ మధ్య ఈ పరీక్షలన్నింటిని నిర్వహించినట్లు కమిషన్ తన ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే ఈ పరీక్షల ఫలితాలు కూడా వెల్లడిస్తామని తన ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.