- ఐపీఎల్ 2025కు ముందు మాల్దీవులకు రోహిత్
- లగ్జరీ రిసార్ట్‌లో హిట్‌మ్యాన్ ఎంజాయ్
- ఐపీఎల్ 2025 కోసం సిద్దమవుతున్న రోహిత్

ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2025కు ముందు ఫుల్ చిల్ అయ్యాడు. ఐపీఎల్‌తో దాదాపుగా రెండు నెలలు బిజీ కానున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ తన ఫామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. సతీమణి రితిక, కూతురు సమైరాతో కలిసి ప్రశాంత వాతవరణంలో ఎంతో సరదాగా గడిపాడు. తాజాగా మాల్దీవుల నుంచి వచ్చిన రోహిత్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మాల్దీవుల్లోని వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషి (Waldorf Astoria Maldives Ithaafushi) అనే లగ్జరీ రిసార్ట్‌లో రోహిత్ శర్మ తన ఫామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. మాల్దీవల్లో ఇది అతిపెద్ద ఐలాండ్‌లలో ఇది ఒకటి. ఇక్కడ ఎంతో విశాలవంతంగా, ప్రశాంత వాతవరణంలో రీఫ్ విల్లా, ఓవర్ వాటర్ విల్లా, బీచ్ విల్లాలు ఉంటాయి. రీఫ్ విల్లాలో హిట్‌మ్యాన్ సేదతీరడాని కొన్ని ఇంగ్లీష్ మీడియాలు కథనాలు రాశాయి. ఇందులో అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయట. రోహిత్ బైక్, సైకిల్ రైడింగ్ చేస్తూ చిల్ అయ్యాడఐ పేర్కొన్నాయి. ఇక్కడ త్రీ బెడ్ రూమ్ విల్లా ఖరీదు ఒక్క రాత్రికి రూ.23 లక్షలు అట. ఈ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు.
మాల్దీవుల టూర్ అనంతరం ఐపీఎల్ 2025 కోసం రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఇక మార్చి 23న ముంబై తన మొదటి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యపై ఓ మ్యాచ్ నిషేధం పడటంతో సూర్య జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.