హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉండి ఎన్నో విజయాలను అందించాడు. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలతో పాటు భారత క్రికెట్ జట్టుకు ఎన్నో అపూర్వమైన విజయాలను అందించాడు. అయితే భారత జట్టుకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చేసిన సేవలకు గాను ఆయన సాధించిన విశిష్టతను గుర్తించేందుకు MCA ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ గౌరవం కోసం రోహిత్‌తో పాటు ముంబైకి చెందిన ఇతర ప్రముఖ క్రికెటర్ల పేర్లు కూడా పోటీలో ఉన్నాయి. MCAకు వచ్చిన ప్రతిపాదనల్లో షరద్ పవార్, విలాస్‌రావు దేశ్‌ముఖ్, అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, దిలీప్ సర్దేశాయ్, పద్మాకర్ శివాల్కర్, డయానా ఎడుల్జీ వంటి పేర్లు కూడా ఉన్నాయి. వాంఖడేలో ఒకే ఒక్క గ్రాండ్ స్టాండ్ మాత్రమే నామకరణం కోసం అందుబాటులో ఉండగా.. ఇది ప్రెసిడెంట్ బాక్స్ పైన ఉంది. ఈ స్టాండ్‌ను ఎవరి పేరు మీద నామకరణం చేయాలనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 15న జరగబోయే సమావేశంలో దీనిపై MCA అపెక్స్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒక వేల హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఈ గౌరవం లభిస్తే, అది అతని కెరీర్‌లో మరో మైలురాయి కానుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..