Revenue Tax: ముందస్తు పన్ను చెల్లింపులకు ముగిసిన గడువు.. జరిమానా బాదుడు తప్పదంతే..! – Telugu Information | Missed advance tax deadline on march 15 penalties curiosity and easy methods to keep away from further prices particulars in telugu

Written by RAJU

Published on:

ముందస్తు పన్ను గడువును పన్ను చెల్లింపుదారులు దాటితే తక్కువ చెల్లింపు లేదా గడువు తేదీలోపు ముందస్తు పన్ను వాయిదాలను చెల్లించకపోతే సెక్షన్ 234సీ కింద నెలకు 1 శాతం సాధారణ వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదనంగా పన్ను చెల్లింపుదారుడు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (అంటే మార్చి 31) మొత్తం పన్ను బాధ్యతలో కనీసం 90 శాతం చెల్లించడంలో విఫలమైతే వారు సెక్షన్ 234బీ కింద నెలకు మరో 1 శాతం లేదా నెలలో కొంత భాగాన్ని సాధారణ వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

జరిమానా బాదుడు నుంచి రక్షణ ఇలా

సెక్షన్ 234బీ, 234 సీ కింద వడ్డీని తగ్గించడానికి పన్ను చెల్లింపుదారులు ఏదైనా బకాయి ఉన్న పన్నును వీలైనంత త్వరగా చెల్లించాలని నిపుణులు చెబుతున్నారు.  కొన్ని సందర్భాల్లో పన్ను అధికారుల ఆమోదానికి లోబడి చెల్లుబాటు అయ్యే, సహేతుకమైన కారణం ఉంటే వారు వడ్డీ మాఫీ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.  మార్చి 31, 2025 కి ముందు ఒకేసారి ఒకేసారి చెల్లించడం వల్ల సెక్షన్ 234బీ కింద వడ్డీని నివారించవచ్చని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మొత్తం పన్ను బాధ్యతలో 90 శాతం చెల్లించినట్లే అని పేర్కొంటున్నారు. అయితే మిస్‌డ్ పేమెంట్ వాయిదా, వాస్తవ చెల్లింపు తేదీ మధ్య  కాలానికి వడ్డీ ఇప్పటికీ వర్తిస్తుంది.

పన్ను చెల్లింపుదారులు ముందస్తు పన్ను గడువును కోల్పోతే వారు సెక్షన్ 234 బీ, 234సీ కింద వడ్డీని పూర్తిగా తప్పించుకోలేరు. కానీ కొన్ని టిప్స్ తీసుకుంటే బాధ్యతను తగ్గించడంలో సహాయపడతాయి. మార్చి 31 తర్వాత సెక్షన్ 234బీ కింద వడ్డీ నెలకు 1 శాతం లేదా దానిలో కొంత భాగాన్ని వసూలు చేస్తారు. కాబట్టి బకాయి ఉన్న పన్ను మొత్తాన్ని వెంటనే చెల్లించడం వల్ల వడ్డీ బాధ్యతను తగ్గించవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ముందు సెక్షన్ 140ఏ కింద స్వీయ-అంచనా పన్ను చెల్లించడం వల్ల సెక్షన్ 234బీ కింద వడ్డీని మరింత పరిమితం చేయవచ్చు. సరైన టీడీఎస్ తగ్గింపులు భవిష్యత్తు ముందస్తు పన్ను వాయిదాలను సకాలంలో చెల్లించడం వల్ల సెక్షన్లు 234బీ, 234సీ కింద భవిష్యత్తులో వడ్డీని నివారించవచ్చు. సెక్షన్లు 234బీ, 234సీ కింద వడ్డీ తప్పనిసరి అయినప్పటికీ సహేతుకమైన కారణం ఉన్న సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 119(2)(ఏ) కింద అసెస్సింగ్ ఆఫీసర్ (ఏఓ)కి వడ్డీ మాఫీ లేదా తగ్గింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification