హైదరాబాద్, మార్చి 31: హెచ్‌సీయూ భూముల వేలం వేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో హెచ్‌సీయూ విద్యార్థుల వరుస ఆందోళనలు, ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ అధినేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వేళ.. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ భూముల వ్యవహారంలో మరో లేఖను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం బయటపెట్టింది.
2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్‌సీయూ అప్పగించింది. ఆ సదరు డాక్యుమెంట్‌పై అప్పటి రిజస్ట్రార్ నరసింహులు సైతం సంతకం చేసి ఉంది. 534.28 గుంటల భూమిని నాటి ప్రభుత్వానికి నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు అప్పగించారు. అయితే అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు.. ప్రభుత్వం విడుదల చేసిన లేఖలో స్పష్టంగా ఉండడం గమనార్హం.
అయితే కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలం వేయ్యాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హెచ్‌సీయూ విద్యార్థులు వరుస ఆందోళనలు చేపట్టారు. ఆ క్రమంలో సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో విద్యార్థులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి ఆందోళనకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి పర్యావరణాన్ని అందిస్తున్న ఈ భూములను విక్రయించడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందులోభాగంగా రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ భూములను వేలం వేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: ఈ ప్రభుత్వానికి కనికరం లేదు
KTR: అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడింది
Pidakala Samaram: మొదలైన పిడకల సమరం.. ఎక్కడంటే..
Maoists: వచ్చే ఏడాది సరిగ్గా.. లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్
Liquor Shops: ఏప్రిల్ 1 నుంచి మద్యం షాపులు బంద్.. ఎందుకంటే..
Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
Updated Date – Mar 31 , 2025 | 09:07 PM