దేశ దిశ

REDMAGIC 10 Air: A Trendy and Highly effective Gaming Smartphone Set to Launch on April 16 in China

REDMAGIC 10 Air: A Trendy and Highly effective Gaming Smartphone Set to Launch on April 16 in China

  • గేమర్ల కోసం ప్రత్యేకంగా..
  • ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల కానున్న REDMAGIC 10 Air.
  • లీక్స్ ద్వారా వెల్లడైన కొన్ని స్పెసిఫికేషన్స్.
REDMAGIC 10 Air: A Trendy and Highly effective Gaming Smartphone Set to Launch on April 16 in China

REDMAGIC 10 Air: రెడ్‌మ్యాజిక్ 10 సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్ REDMAGIC 10 Air చైనా మార్కెట్‌లో ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించగా, తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన డిజైన్‌ను మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో విడుదల చేసింది. ఇవి షాడో బ్లాక్, ఫ్రోస్ట్ బ్లేడ్ వైట్, ఫ్లేమ్ ఆరంజ్ రంగుల్లో ఉంటాయని రెడ్‌మ్యాజిక్ వెల్లడించింది. ఈ ఫోన్ సంబంధించి రెడ్‌మ్యాజిక్ CEO నీ ఫీ మాట్లాడుతూ.. ఈ ఫోన్ పొడవుగా, బలంగా ఉండే విధంగా డిజైన్ చేయబడిందని.. దీనిని ఒకసారి చేతిలో పట్టుకుంటే వదలటం కష్టమని తెలిపారు. ఈ ఫోన్‌ ను యువ గేమర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: Ronald Rose : ఏపీకి కాదు… రోనాల్డ్ తెలంగాణలోనే..! సీనియర్ ఐఏఎస్ అధికారికి ఊరట..

ఇక ఈ ఫోన్ సంబంధించిన లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల Full HD+ BOE OLED స్క్రీన్ ఉండనుందని సమాచారం. దీని రిఫ్రెష్ రేట్ 120Hz వరకు ఉండనుంది. అలాగే, ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, ఇంకా 16MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ పరిమాణం 164.3 x 76.6 x 7.85mm, బరువు 205 గ్రాములు మాత్రమే ఉంటాయని లీకులు చెబుతున్నాయి. ఇది 6000mAh భారీ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా.. మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యల్ప బరువు, అత్యల్ప మందం గల గేమింగ్ ఫోన్లలో ఒకటిగా నిలవనుందని అంచనా. అలాగే ఈ మొబైల్ కు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. మొత్తంగా ఈ రెడ్‌మ్యాజిక్ 10 ఎయిర్ అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ గేమింగ్ సామర్థ్యాలతో యూత్‌కు నచ్చేలా ఉండబోతోంది. పూర్తి వివరాలు ఫోన్ అధికారికంగా విడుదలయ్యే ఏప్రిల్ 16న తెలిసే అవకాశముంది.

Exit mobile version