
RCB vs RR: బెంగళూరులో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) భారీ స్కోర్ ను సాధించింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక RCB తరఫున దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు మంచి శుభారంభం అందించారు. కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు, దేవదత్ పడిక్కల్ కేవలం 27 బంతుల్లో 50 పరుగులు చేసి RCB స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక ఓపెనర్ ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేసిన తర్వాత ఔట్ కాగా.. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు భారీ భాగస్వామ్యని నెలకొల్పారు. ఇక ఆపై వచ్చిన టిమ్ డేవిడ్ 23 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. ఆఖరులో జితేశ్ శర్మ 10 బంతుల్లో 20 పరుగులతో మెరిశాడు. బ్యాట్స్మెన్లు మంచి ప్రదర్శన చేయడంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోర్ అందుకుంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే.. వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్ తీయగా, సందీప్ శర్మ 2 కీలక వికెట్లు సాధించాడు. ఇక మిగితా బౌలర్లు ఫజల్హక్ ఫారూకీ, తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్ వికెట్లు తీయలేకపోయారు. చూడాలి మరి రాజస్థాన్ బాట్స్మెన్లు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తారో లేదో.