RCB vs GT: రోహిత్‌పై పగ తీర్చుకున్న సిరాజ్‌.. భయంతో వణికిపోతున్న ఆర్సీబీ! ఎందుకంటే..?

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025లో భాగంగా భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న ఆర్సీబీ తమ డెన్‌లో తొలి మ్యాచ్‌ ఆడనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది ఆర్సీబీ. ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో ఆర్సీబీకి ఇదే తొలి మ్యాచ్‌ కావడంతో ఇంట్రెస్టింగ్‌గా మారింది. కేకేఆర్‌ను ఈడెన్‌ గార్డెన్స్‌లో, చెన్నైని చెపాక్‌లో మట్టికరిపించిన ఆర్సీబీ సూపర్‌ జోష్‌లో ఉంది. ఇక సొంత మైదానంలో అభిమానుల మధ్య ఆర్సీబీ ఎలా చెలరేగిపోతుందో అని ఆర్సీబీ ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్‌ స్ట్రాంగ్‌గా, హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తున్నప్పటికీ ఓ భయం మాత్రం ఆర్సీబీని వెంటాడుతోంది. ఆ భయం పేరు సిరాజ్‌. అదేంటి.. సిరాజ్‌ మాజీ ఆర్సీబీ ప్లేయర్‌ కాదా? అతన్ని కావాలని వదిలించుకున్నార కదా? అతనికి ఆర్సీబీ ఎందుకు భయపడుతుంది అని మీకు డౌట్‌ రావొచ్చు.

అందుకోసం రీసెంట్‌గా మార్చి 29న ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ను ఓ సారి గమనిస్తే.. సిరాజ్‌ సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. ఏకంగా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, డేంజరస్‌ ఓపెనర్‌ ర్యాన్ రికెల్టన్‌లను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అందులో ముఖ్యంగా రోహిత్‌ను ఫస్ట్‌ ఓవర్‌లోనే అవుట్‌ చేయడం సెన్సేషన్‌గా మారింది. ఎందుకంటే.. సిరాజ్‌ను ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ సమాధానం ఇస్తూ.. సిరాజ్‌ కొత్త బాల్‌తో ఉన్నంత ఎఫెక్టీవ్‌గా ఓల్డ్‌ బాల్‌తో ఉండటం లేదంటూ పేర్కొన్నాడు. ఒక రకంగా సిరాజ్‌ స్కిల్‌పై రోహిత్‌ వేలెత్తి చూపించాడు. రోహిత్‌ చెప్పిన మాట ఏ బౌలర్‌ మనసునైనా గాయపరుస్తుంది. ఇక అగ్రెసివ్‌ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సిరాజ్‌, వన్డేలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఉండి, సొంత కెప్టెన్‌ నుంచి ఇలాంటి మాట వింటే కడుపు మండిపోదా? ఆ మంటను ముంబైతో మ్యాచ్‌లో చూపించాడు.

తొలి ఓవర్‌లో రోహిత్‌ను సూపర్‌ డెలవరీతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. సిరాజ్‌ వేసిన బాల్‌ ఆడేందుకు రోహిత్‌ వద్ద అస్సలు సమాధానమే లేదు. అది చూసిన తర్వాత.. సోషల్‌ మీడియాలో సిరాజ్‌ వైరల్‌ అయిపోయాడు. గతంలో రోహిత్‌ సిరాజ్‌ గురించి చేసిన కామెంట్ వీడియో, అతని బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన వీడియో పక్కపక్కన పెట్టి.. ఓల్డ్‌ బాల్‌తో తర్వాత ముందు కొత్త బాల్‌తో సిరాజ్‌ బౌలింగ్‌లో సర్‌వైవ్‌ అవ్వు అంటూ రోహిత్‌పై సెటైర్లు కురిపించారు నెటిజన్లు. అంతకంటే ముందు ఈ సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సిరాజ్‌ 4 ఓవర్లలో 54 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. కానీ, నెక్ట్స్‌ మ్యాచ్‌ ముంబైతో అనగానే తన బెస్ట్‌ను ఇచ్చిపడేశాడు. ముంబైతో మ్యాచ్‌లో సిరాజ్‌లో కోపం, కసి రెండు కనిపించాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోగా, తన బౌలింగ్‌ను క్వశ్చన్‌ చేస్తావా అంటూ రోహిత్‌పై అతను పగతీర్చుకున్నట్లు కనిపించాడు.

ఇప్పుడు ఆర్సీబీపై కూడా అలాంటి కసినే చూపిస్తాడేమో అని కొంతమంది ఫ్యాన్స్‌ భయపడుతున్నారు. చాలా ఏళ్లుగా ఆర్సీబీకి నమ్మిన బంటులా ఉంటూ, తన పీక్‌ టైమ్‌లో వేరే టీమ్స్‌ నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా, వేలంలోకి వెళ్తే భారీ ధర దక్కుతుందని తెలిసినా కూడా ఆర్సీబీ, కోహ్లీపై ఉన్న ప్రేమతో అందులోనే ఉండిపోయాడు. అంత లాయల్టీ చూపించినా కూడా ఆర్సీబీ తనను రిటేన్‌ చేసుకోకపోగా, ఆక్షన్‌లో కనీసం బిడ్‌ వేయకపోవడం సిరాజ్‌ను కచ్చితంగా బాధపెట్టి ఉంటుంది. ఆ బాధను ఆర్సీబీతో మ్యాచ్‌లో సిరాజ్‌ చూపించే ఛాన్స్‌ ఉంది. రోహిత్‌ను టార్గెట్‌ చేసి అవుట్‌ చేసినట్లు, కోహ్లీని ఎక్కడ అవుట్‌ చేస్తాడో, ఆర్సీబీని ఎక్కడ దెబ్బ కొడతాడో అని ఆర్సీబీ ఫ్యాన్స్‌ కాసింత భయపడుతున్నారు. ఎందుకంటే.. బలంతో కొట్టే దెబ్బకంటే.. బాధతో కొట్టే దెబ్బకు పవర్‌ ఎక్కువగా ఉంటుంది. మరి తనను కాదనుకున్న ఆర్సీబీపై సిరాజ్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights