- చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.

RCB vs DC: నేడు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇకపోతే ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. దీనితో ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI:
జేక్ ఫ్రేసర్-మర్క్, ఫాఫ్ డుప్లెసిస్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ (కెప్టెన్), విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
అభిషేక్ పోరెల్, దర్శన్ నల్కండే, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, డొనోవన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI:
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, క్రుణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్
ఆర్సిబి ఇంపాక్ట్ ప్లేయర్స్:
సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.