RCB IPL 2025 Preview: 18ఏళ్లుగా తొలి టైటిల్‌కు దిక్కులేదు.. ఆర్‌సీబీ బలాలు, పూర్తి షెడ్యూల్ మీకోసం

Written by RAJU

Published on:


Royal Challengers Bengaluru Best Squad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) ప్రారంభ మ్యాచ్ మార్చి 22న కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. ఇప్పటివరకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి జట్టు 18 ఏళ్ల కరువును అంతం చేయగలదని అంతా భావిస్తున్నారు. చాలా మంది దిగ్గజ ఆటగాళ్లను జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి కెప్టెన్సీ రజత్ పాటిదార్‌కు ఇచ్చారు. ఇటువంటి పరిస్థితిలో, RCB కోసం అనుభవజ్ఞులు చేయలేని పనిని యువ రజత్ పాటిదార్ చేయగలరా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. IPL 2025 కి RCB జట్టు ఎలా ఉండనుంది, జట్టు పూర్తి షెడ్యూల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జట్టులోని ఈ ఆటగాళ్లపై ఓ కన్నేయాల్సిందే..

విరాట్ కోహ్లీ – గత కొన్ని సీజన్లలో తన జట్టు తరపున నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విరాట్ కోహ్లీ, మరోసారి తన జట్టు తరపున ఇన్నింగ్స్ ప్రారంభించి వారికి గొప్ప ఆరంభాన్ని ఇస్తాడు. ఇటువంటి పరిస్థితిలో, అతని ఇటీవలి ఫామ్ చూస్తుంటే, అందరూ అతని నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.

ఫిల్ సాల్ట్ – గత సీజన్‌లో కేకేఆర్ తరపున ఆడిన ఫిల్ సాల్ట్ ఈసారి ఆర్‌సీబీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా తన జట్టుకు గొప్ప ఆరంభం ఇవ్వాలని అతను కోరుకుంటున్నాడు. ఈ ఆటగాడికి దూకుడుగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంది.

ఇవి కూడా చదవండి

రజత్ పాటిదార్ – జట్టులో చాలా మంది దిగ్గజాలు ఉన్నప్పటికీ, RCB యాజమాన్యం కెప్టెన్ పాత్రను రజత్ పాటిదార్‌కు అప్పగించింది. అతను మిడిల్ ఆర్డర్‌లో మూడవ స్థానంలో తన జట్టును బలోపేతం చేయడం కనిపిస్తుంది. దేశీయ క్రికెట్‌లో ఈ ఆటగాడి గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.

ఆర్‌సీబీ అతిపెద్ద బలం..

ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి అతిపెద్ద బలం ఏమిటంటే జట్టు బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అందరూ మంచి బ్యాట్స్‌మెన్‌లే. విరాట్ కోహ్లీ నుంచి 8వ స్థానంలో ఉన్న కృనాల్ పాండ్యా వరకు చాలా మంది బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. ఆ జట్టులో ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు.

ఆర్‌సీబీ అతిపెద్ద బలహీనత..

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ కాస్త పేలవంగా కనిపిస్తోంది. జట్టులో మంచి స్పిన్నర్ లేడు. అయితే, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్ ఎంపిక ఉంది. కానీ, వీరిద్దరూ ఆఫ్-స్పిన్నర్లు టీ20లో అంత ప్రభావవంతంగా నిరూపించుకోలేరు. సుయాష్ శర్మ ఉన్నాడు. కానీ, అతనికి అంత అనుభవం లేదు.

ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ ప్రదర్శన..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2009, 2011, 2016లలో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, దురదృష్టవశాత్తు ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఇది కాకుండా, 2015, 2020, 2021, 2022, 2024 లలో ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగింది. కానీ, ఇప్పటివరకు RCB అభిమానులు టైటిల్ గెలుస్తుందనే ఆశతో సీజన్ మొదలుపెడతారు. కానీ, వాళ్లు ఆనందించే అవకాశం మాత్రం పొందడంలేదు.

RCB ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

అంచనా వేసిన XI: ఫిల్ సాల్ట్ ( WK ), విరాట్ కోహ్లీ ( కెప్టెన్ ), రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్, నువాన్ తుషార/లుంగి ఎన్‌గిడి, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్.

RCB IPL 2025: పూర్తి జట్టు..

విరాట్ కోహ్లీ (భారతదేశం), రజత్ పాటిదార్ (భారతదేశం), యష్ దయాల్ (భారతదేశం), జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), జితేష్ శర్మ (భారతదేశం), భువనేశ్వర్ కుమార్ (భారతదేశం), లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), రాసిఖ్ దార్ (భారతదేశం), కృనాల్ పాండ్యా (భారతదేశం), సుయాష్ శర్మ (భారతదేశం), జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా), దేవదత్ పడిక్కల్ (భారతదేశం), రొమారియో షెపర్డ్ (వెస్టిండీస్), నువాన్ తుషార (శ్రీలంక), లుంగి ఎన్గిడి (దక్షిణాఫ్రికా), స్వప్నిల్ సింగ్ (భారతదేశం), మనోజ్ భాండాగే (భారతదేశం), స్వస్తిక్ చికారా (భారతదేశం), అభినందన్ సింగ్ (భారతదేశం), మోహిత్ రాథీ (భారతదేశం)

IPL 2025 కోసం RCB షెడ్యూల్..

KKR vs RCB – రాత్రి 7:30 – మార్చి 22 – కోల్‌కతా

CSK vs RCB – రాత్రి 7:30 – మార్చి 28 – చెన్నై

RCB vs GT – రాత్రి 7:30 – ఏప్రిల్ 2 – బెంగళూరు

MI vs RCB – రాత్రి 7:30 – ఏప్రిల్ 7 – ముంబై

RCB vs DC – రాత్రి 7:30 – ఏప్రిల్ 10 – బెంగళూరు

RR vs RCB – మధ్యాహ్నం 3:30 – ఏప్రిల్ 13 – జైపూర్

RCB vs PBKS – 7:30 pm – ఏప్రిల్ 18 – బెంగళూరు

PBKS vs RCB – 3:30 pm – ఏప్రిల్ 20 – ముల్లన్‌పూర్

RCB vs RR – రాత్రి 7:30 – ఏప్రిల్ 24 – బెంగళూరు

DC vs RCB – రాత్రి 7:30 – ఏప్రిల్ 27 – ఢిల్లీ

RCB vs CSK – రాత్రి 7:30 – మే 3 – బెంగళూరు

LSG vs RCB – రాత్రి 7:30 – మే 9 – లక్నో

RCB vs SRH – రాత్రి 7:30 – మే 13 – బెంగళూరు

RCB vs KKR – రాత్రి 7:30 – మే 17 – బెంగళూరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification