RCB: కాటేరమ్మ కొడుక్కి ఎంత కష్టమొచ్చింది.! నిజం రుజువైతే RCBకి క్షమాపణ చెప్పాల్సిందే..

Written by RAJU

Published on:


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతడు ఉబర్‌ సంస్థతో కలిసి చేసిన ఓ బ్రాండ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటనలో ‘రాయల్లీ ఛాలెంజ్డ్ బెంగళూరు’ అంటూ RCB బ్రాండ్‌ను అపహాస్యం చేశారని.. యాడ్‌ను వెంటనే తీసివేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇటు దేశంలోనే కాదు.. విదేశాలలోనూ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ జట్టు ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ 17 సీజన్లలోనూ ట్రోఫీ గెలవకపోయినా.. RCB బ్రాండ్ ఏమాత్రం చెరిగిపోలేదు. ఇప్పటికీ విరాట్ కోహ్లీ ఉన్న బెంగళూరు జట్టంటే ఫ్యాన్స్ పడిచస్తారు.

అయితే ట్రావిస్ హెడ్‌పై చిత్రీకరించిన యాడ్‌లో ఉబర్ సంస్థ.. RCB బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసిందని ఆరోపించింది బెంగళూరు ఫ్రాంచైజీ. ఇలా చేయడం ద్వారా నేరుగా తమ ట్రేడ్‌మార్క్‌ను తగ్గించడంపై దాడి చేయడమేనని పేర్కొంది. RCB ఫ్రాంచైజీని ఎగతాళి చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే ఈ యాడ్‌ను చిత్రీకరించారని వాపోయింది. అలాగే యాడ్‌లో తమ నినాదం ‘ఈ సాలా కప్ నమ్దే’ను సైతం అపహాస్యం చేశారని ఫ్రాంచైజీ కోర్టుకు తెలిపింది. ఈ నినాదంతో అటు జట్టుకు, ఇటు అభిమానులకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. ప్రకటనలో దానిని వ్యంగ్యంగా ప్రదర్శించడం అభిమానులు, జట్టు సభ్యుల భావోద్వేగాలతో ఆడుకోవడమేనని చెప్పింది. ఇదిలా ఉంటే.. ఈ యాడ్‌పై ఉబర్ సంస్థ ఇంకా రిప్లయ్ ఇవ్వాల్సి ఉంది. కాగా, ఒకవేళ RCB వాదనలకు కోర్టు అంగీకరిస్తే.. ఉబర్ ఇండియా ప్రకటనను తొలగించడమే కాకుండా క్షమాపణ కూడా చెప్పాల్సి ఉంటుంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights