- వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు
- వచ్చే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది
- ఏప్రిల్ నెలలో ప్రత్యేక పండగలు, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కలుపుకుని భారీగా సెలవులు

ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో ప్రత్యేక పండగలు, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కలుపుకుని భారీగా సెలవులు ఉండనున్నాయి. మొత్తం 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుంటే మీ సమయం, మీ పనుల్లో జాప్యం ఏర్పడకుండా ఉంటుంది. అయితే బ్యాంకు సెలవు రోజుల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATM ల ద్వారా బ్యాంకింగ్ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
Also Read:Pakistan: హఫీస్ సయీద్ బంధువు హతం.. “గుర్తుతెలియని వ్యక్తుల” ఖాతాలో మరో ఉగ్రవాది..
ఏప్రిల్‌లో బ్యాంకు సెలవులు
*ఏప్రిల్ 6 ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
*ఏప్రిల్ 10 గురువారం జైన మతం యొక్క 24వ తీర్థంకరుడు అయిన భగవాన్ మహావీర్ పుట్టినరోజు జరుపుకుంటారు. ప్రభుత్వ సెలవుదినం కారణంగా ఈ రోజు బ్యాంకులు కూడా మూసివేయబడతాయి.
*ఏప్రిల్ 12న నెలలో రెండవ శనివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
*ఏప్రిల్ 13 ఆదివారం కాబట్టి బ్యాంకులు మూసి ఉంటాయి.
*రాజ్యాంగ నిర్మాత బాబా భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవు దినం కారణంగా బ్యాంకులు కూడా మూసివేయబడతాయి.
*ఏప్రిల్ 15న బోహాగ్ బిహు కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కోల్‌కతా, సిమ్లాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
*బోహాగ్ బిహు కారణంగా ఏప్రిల్ 16న గౌహతిలో బ్యాంకులు మూసివేయబడతాయి.
*ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే కావడంతో బ్యాంకులు మూసివేయబడతాయి.
*గరియా పూజ సందర్భంగా ఏప్రిల్ 21న అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
*ఏప్రిల్ 26న నెలలో నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులు మూసివేయబడతాయి.
*ఏప్రిల్ 29న శ్రీ పరశురామ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
*బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30న బెంగళూరులో బ్యాంకులు మూసివేయబడతాయి.