RBI Introduced 13 Financial institution holidays in Could

Written by RAJU

Published on:

  • వచ్చే నెలలో భారీగా బ్యాంకు సెలవులు
  • మేలో 13 రోజులు సెలవులు
RBI Introduced 13 Financial institution holidays in Could

బ్యాంకు సేవలు వినియోగించుకునే వారు ఎప్పటికప్పుడు బ్యాంకు రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలి. సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరగొచ్చు. లేదా ఆర్థికంగా నష్టం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. వచ్చే మే నెలలో కూడా భారీగా బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. మేలో 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకు సెలవులు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన ఉత్సవాల ఆధారంగా నిర్ణయించబడతాయని గుర్తుంచుకోవాలి. 2025 మే నెలలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. బుద్ధ పూర్ణిమ, కార్మిక దినోత్సవం, మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో బ్యాంకులు మూసివేస్తారు.

Also Read:Hit-3 : ఏపీలో హిట్-3 టికెట్ల రేట్లు పెంచుతూ జీవో

మే నెలలో బ్యాంకు సెలవుల లిస్ట్

మే 1 గురువారం – మహారాష్ట్ర దిన్, మే డే (కార్మిక దినోత్సవం)
మే 4 ఆదివారం- వారాంతపు సెలవు (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
మే 9 (శుక్రవారం) – రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని, 2025 మే 9, శుక్రవారం కోల్‌కతాలోని బ్యాంకులు మూసివేయబడతాయి.
మే 10 శనివారం- రెండవ శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
మే 11 ఆదివారం- వారాంతపు సెలవు (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
మే 12 (సోమవారం) – బుద్ధ పూర్ణిమ
అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాంచీ, సిమ్లా మరియు శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు.
మే 16 (శుక్రవారం) – రాష్ట్ర దినోత్సవం
రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 16, శుక్రవారం సిక్కిం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
మే 18 ఆదివారం
వారాంతపు సెలవు (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
మే 24శనివారం 2025
నాల్గవ శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
మే 25 ఆదివారం 2025
వారాంతపు సెలవు (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
మే 26 సోమవారం 2025
కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి (త్రిపురలో బ్యాంకులకు సెలవు)
మే 29 గురువారం 2025
మహారాణ ప్రతాప్ జయంతి (రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ , హర్యానాలో బ్యాంకులకు సెలవు)
మే 30 శుక్రవారం 2025
శ్రీ గురు అర్జున్ దేవ్ జీ బలిదానం దినోత్సవం (కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights