రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఐదు ప్రముఖ బ్యాంకులపై భారీ జరిమానాలు విధించింది. ఈ బ్యాంకుల్లో ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, IDBI, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. ఈ ఐదు బ్యాంకులపై మొత్తం రూ.2.52 కోట్లకు పైగా జరిమానా పడింది. సైబర్ సెక్యూరిటీ, KYC, కస్టమర్ సర్వీస్ వంటి అంశాల్లో ఈ బ్యాంకులు నియమాలను ఉల్లంఘించిన క్రమంలో ఆర్బీఐ ఫైన్ వేసింది. ఈ క్రమంలో బ్యాంకులు నియమాలను సరిగ్గా పాటించని విషయాలపై ఆర్బీఐ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంది.
ఏ బ్యాంకులపై ఎందుకు జరిమానా?
ICICI బ్యాంక్: ఈ బ్యాంకుపై రూ. 97.80 లక్షల జరిమానా విధించారు. సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్, KYC నిబంధనలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ జారీలో నియమాలను పాటించలేదని RBI గుర్తించింది. ఈ లోపాలు కస్టమర్ల డేటా భద్రతను ప్రభావితం చేస్తాయని RBI తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంకుకు రూ. 61.40 లక్షల జరిమానా పడింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్ నిబంధనలను అనుసరించలేదని RBI తెలిపింది. ఈ క్రమంలో కస్టమర్లకు అందించే సేవల్లో లోపాలు ఉన్నాయని గమనించారు.
IDBI బ్యాంక్: IDBI బ్యాంకుపై రూ. 31.80 లక్షల జరిమానా విధించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా వ్యవసాయ రుణాలకు సంబంధించిన వడ్డీ సబ్సిడీ స్కీమ్ నిబంధనలను పాటించలేదని RBI గుర్తించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఈ బ్యాంకుపై కూడా రూ. 31.80 లక్షల జరిమానా పడింది. KYC నిబంధనలను సరిగ్గా అమలు చేయలేదని RBI తెలిపింది.
యాక్సిస్ బ్యాంక్: యాక్సిస్ బ్యాంకుపై రూ. 29.60 లక్షల జరిమానా విధించారు. అంతర్గత/కార్యాలయ ఖాతాలను అనధికారికంగా నిర్వహించినట్లు RBI గమనించింది.
ఈ జరిమానాలు ఎందుకంటే
RBI బ్యాంకులపై జరిమానాలు విధించడం అనేది కేవలం శిక్షణ కోసం మాత్రమే కాదు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, భద్రత, కస్టమర్ హక్కులను కాపాడేందుకు చేసే ప్రయత్నమని చెప్పవచ్చు. సైబర్ సెక్యూరిటీ, KYC వంటి నిబంధనలు కస్టమర్ల డేటా, డబ్బును సురక్షితంగా ఉంచడానికి రూపొందించినవి. కానీ ఈ నిబంధనలను బ్యాంకులు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..
Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
Read More Business News and Latest Telugu News
Updated Date – May 04 , 2025 | 08:21 AM