Ramagundam: రామగుండం ఎన్టీపీసీలో అనుమతి లేని భవనాలకు రూ.99కోట్ల జరిమానా విధించిన కార్పొరేషన్‌ అధికారులు

Written by RAJU

Published on:

అనుమతి లేని నిర్మాణాలపై గత మార్చి 19న రామగుండం మునిసిపల్ అధికారులు ఎన్టీపిసి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నోటీస్ లపై ఎలాంటి స్పందన లేకపోవడంతో మార్చి 29న జరిమానా నోటీసులు జారీ చేశారు. నోటీసుల ప్రకారం ఎన్టీపిసి లోని టైప్ బి బిల్డింగ్ కు రూ.39.61కోట్లు, హెచ్ ఓ డి బిల్డింగ్ కు రూ. 18.55కోట్లు, టైప్ డి బిల్డింగ్ కు రూ. 27.99కోట్లలు, గెస్ట్ హౌస్ బిల్డింగ్ కు రూ.6.61కోట్లు, ఏసీ రెస్టారెంట్ బిల్డింగ్ కు రూ. 7.35కోట్లు, కమ్యూనిటీ సెంటర్ బిల్డింగ్ కు రూ.4.83కోట్లు .. మొత్తం ఆరు భవనాలకు సంబంధించి రూ.99.28కోట్లు జరిమానా విధించినట్లు పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అరుణశ్రీ ప్రకటించారు. నిర్ణీత గడువులోపు జరిమానా చెల్లించకపోవడంతో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Subscribe for notification
Verified by MonsterInsights