- గచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదు.
- ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించిన రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య.

R. Krishnaiah: రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, అల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. 400 ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆయన ఆ తీర్పు ప్రభుత్వానికి “చెంపపెట్టు లాంటిది” అంటూ పేర్కొన్నారు.
Read Also: Jagadish Reddy: HCU తరలింపు అనాలోచిత నిర్ణయం.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్
కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని యూనివర్సిటీని బుల్డోజర్లతో ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతిని ధ్వంసం చేయడం సరికాదు, ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి అప్పగించాలని కోరారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు మంచిది అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాలలో తీవ్ర చర్చనీయంశంగా మారింది.