దేశ దిశ

Rajnath Singh: ‘‘We won’t depart anybody behind.’’ Pahalgam assaults could have a world-shaking revenge

Rajnath Singh: ‘‘We won’t depart anybody behind.’’ Pahalgam assaults could have a world-shaking revenge

  • ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
  • ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది..
  • పహల్గామ్ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్..
Rajnath Singh: ‘‘We won’t depart anybody behind.’’ Pahalgam assaults could have a world-shaking revenge

Rajnath Singh: పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ భారతదేశం తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. పాకిస్తాన్‌కి, టెర్రరిస్టులకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. హమాస్‌పై ఇజ్రాయిల్ దాడులు చేసిన విధంగా భారత్ దాడులు చేయాలని కోరుకుంటోంది. మంగళవారం కాశ్మీర్ చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది మరణించారు. ఇప్పటికే ప్రధాని మోడీతో సహా మంత్రులంతా అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు.

Read Also: Kashmir Tourism: పహల్గామ్ ఉగ్రదాడితో కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం.. వెనక్కి తగ్గిన ఏపీవాసులు

ఇదిలా ఉంటే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా బిగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని, వారి నిర్వాహకులను వదిలిపెట్టేది లేదని, ప్రత్యక్ష ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని, భారతదేశం దానిపై కుట్రకు పాల్పడిన వారిని గుర్తించి, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ‘‘ఈ చర్యలకు బాధ్యులు సమీప భవిష్యత్తులో బలమైన ప్రతిస్పందన ఎదుర్కొంటారు’’ అని అన్నారు.

“మాపై దాడి చేసిన వారిని మాత్రమే కాదు… ఈ కుట్రను అమలు చేయడానికి తెర వెనుక దాక్కున్న వారిని కూడా మేము చేరుకుంటాము. దాడి చేసినవారు, వారి యజమానులు లక్ష్యంగా చేసుకుంటారు” అని రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. భారత్ ఒక బలమైన దేశం, ఉగ్రవాదానికి భయపడమని, ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో జవాబు ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ని ఎవరూ బలపెట్టలేరని స్పష్టం చేశారు.

Exit mobile version