హైదరాబాద్, మార్చి 17: ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరో పథకాన్ని ప్రారంభించారు. సోమవారం నాడు.. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ పథకం పూర్తి వివరాలివే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఒక్కో లబ్దిదారుడికి రూ. 4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారు. 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. జూన్ 2వ తేదీన రాయితీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది.
Also Read:
ఎన్టీఆర్ స్టేడియంలో పట్టపగలే దారుణం..
ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించండి
ప్రైవేటు భాగాల్లో బంగారు దాచిపెట్టి..
For More Telangana News and Telugu News..
Updated Date – Mar 17 , 2025 | 04:53 PM