- యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ అదుర్స్
- బ్యాటర్ల దూకుడు
- రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

RR vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి నుంచి బ్యాటర్లు బౌండరీలతో అదరగొట్టారు. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ 67 పరుగులతో అదరగొట్టాడు. అతనికి తోడుగా రియాన్ పరాగ్ 43 పరుగులతో అండగా నిలిచాడు. అటు సంజు శాంసన్ కూడా 38 పరుగులతో బ్యాట్ ఝులిపించాడు. హెట్‌మయర్ 20 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇలా అందరూ కలిసికట్టుగా బ్యాటింగ్ చేయడంతో రాజస్థాన్ 205 రన్స్ చేసింది.
Read Also : Tamannaah : పేపర్ లో నాపై అలా రాశారు.. ఏడ్చేశా!
అటు పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, మార్కో యాన్సెన్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయంది. 13వ ఓవర్ లో జైశ్వాల వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. 14వ ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి. జైశ్వాల్ క్రీజులో ఉన్నంతసేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 40 బంతుల్లో హాప్ సెంచరీ చేసిన జైశ్వాల్ 67 పరుగుల వద్ద ఫెర్గూసన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ వేగంగా ఆడటంతో స్కోర్ పెరిగింది.