- రాణించిన యశస్వి
- తేలిపోయిన పంజాబ్ బ్యాటర్లు
- భారీ తేడాతో విజయం

RR vs PBKS : రాజస్థాన్ రాయల్స్ దుమ్ములేపింది. పంజాబ్ మీద 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ దారుణంగా విఫలం అయింది. నేహల్ వధేరా (62) తప్ప మిగతా బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. ఎంతో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్ వెల్ 30 పరుగులకే వెనుదిరిగాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17), షెడ్గే (2), మార్కో యాన్సెన్ (3) ఇలా అందరూ విఫలం అయ్యారు. దాంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన పంజాబ్ కేవలం 155 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, సందీప్ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు.
Read Also : Raghavendra Rao : నన్ను ఈ స్థాయికి తెచ్చింది ఆ స్టార్ హీరోనే : రాఘవేంద్రరావు
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. యంగ్ డైనమిక్ యశస్వి జైస్వాల్ 67 పరుగులతో పరుగుల వరద పారించాడు. అతనికి తోడుగా రియాన్ పరాగ్ 43 పరుగులతో సత్తా చాటాడు. వీరిద్దరి దెబ్బకు రాజస్థాన్ పరుగుల బోర్డు ఉరకలేసింది. ఇంకో ఆటగాడు సంజు శాంసన్ కూడా 38 రన్స్ తో బ్యాట్ ఝులిపించాడు. ఇంకేముంది భారీ స్కోర్ సాధ్యం అయింది. ఈ దెబ్బతో రాజస్థాన్ ఖాతాలో మరో విజయం నమోదైంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సమిష్టిగా కృషి చేశారు.