Rain Alert in Telangana: Orange Warning Issued for A number of Districts with Gusty Winds & Thunderstorms

Written by RAJU

Published on:

  • ఈదురు గాలులతో వర్షాలు.. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
  • భారీగా మెరుపులు.. కొన్ని జిల్లాల్లో పిడుగు పడే ప్రమాదం
  • హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
Rain Alert in Telangana: Orange Warning Issued for A number of Districts with Gusty Winds & Thunderstorms

Orange Alert: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోందా? రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రత్యేకించి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

అంతేకాకుండా ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబాబాద్‌, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్‌లు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి గాలుల నడుమ ఈ వర్షాలు కొంత ఊరట కలిగించనున్నా… అలర్ట్ లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రైతులు, ప్రయాణికులు, పాఠశాలలకు వెళ్లే పిల్లలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

Realme NARZO 80 Pro 5G: 6.77 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరా, IP69 రేటింగ్ తో వచ్చేసిన రియల్‌మీ నార్జో 80 ప్రో

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights