Rain Alert: చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.. – Telugu Information | Newest Climate Report: Heavy Rains in Hyderabad, Telangana and Andhra Pradesh For Subsequent Two Days watch video

Written by RAJU

Published on:

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎండలు అదరగొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ చెబుతోంది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లో గురువారం మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించింది. అకస్మాత్తుగా మధ్యాహ్నం వేళ వాతావరణం మారి.. భారీ వర్షం కురిసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి..

తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. కొమురం భీం జిల్లాలో వాతవరణం ఒక్కసారిగా చల్లబడింది. కెరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

లైవ్ వీడియో చూడండి..

LIVE : హైదరాబాద్ లో భారీ వర్షం | Heavy Rain In Hyderabad - TV9

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. 2గంటల పాటు ఉరుములు, మెరుపులతో ఏక ధాటిగా వర్షం కురిసింది. నిజామాబాద్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, సదాశివనగర్, కామారెడ్డి, దగ్గి, జుక్కల్లో భారీ వర్షం కురిసింది. ఇదే జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి.. చిత్తూరు జిల్లా కుప్పంలో వాతావరణ చల్లబడింది. ఉదయం నుంచి మబ్బులు కమ్మేశాయి. గంటకు పైగా వర్షం కురిసింది. వాతావరణ చల్లబడ్డంతో జనం వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights