Railway News: హైదరాబాద్ – చెన్నై మధ్య రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు కీలక అప్‌డేట్ ఇది. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభ స్థానం మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు చర్లపల్లి నుంచి బయలుదేరి వెళ్లనున్నాయి. అలాగే ఎదురుదిశలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఈ ఎక్స్‌ప్రెస్ ఇకపై చర్లపల్లి వరకే వస్తుంది. ఆ మేరకు చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెం.12603)ను చెన్నై సెంట్రల్ – చర్లపల్లిగా రైల్వే శాఖ మార్చింది. ఈ నిర్ణయం శుక్రవారం (మార్చి 7) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 04.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
అలాగే హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (నెం.12604)ను చర్లపల్లి – చెన్నై సెంట్రల్‌గా మారింది. ఈ మార్పు శనివారం (మార్చి 8) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ సాయంత్రం 05.25 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.40 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.
అలాగే గోరఖ్‌పుర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నెం.12589, 12590) గోరఖ్‌పుర్-చర్లపల్లి, చర్లపల్లి-గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌గా మారాయి. మార్చి 12, 13 తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు.

చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు