Rachakonda Police Arrest Gujarat Woman in Child Trafficking Case

Written by RAJU

Published on:

  • జోరుగా పిల్లల అక్రమ రవాణా
  • 6నెలల్లో 20 పసి పిల్లల విక్రయం
  • 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు
Rachakonda Police Arrest Gujarat Woman in Child Trafficking Case

“పిల్లల్ని నేను కిడ్నాప్ చేయలేదు.. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం.. లక్ష రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాం.. ఆ తర్వాత పిల్లలు లేని వాళ్లకు వారిని అమ్మి సొమ్ము చేసుకున్నాం. ఒక్కొక్క పిల్లాడికి ఐదు నుంచి పది లక్షల రూపాయలుకు అమ్మివేశాం.. మేము కిడ్నాపర్లం కాదు. కేవలం పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ మాత్రమే అమ్మినం..” ఇది పసి పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న నిందితుల వాదన. అయితే గుజరాత్‌లో వందన పిల్లల అమ్మకాలు కేసులో కీ రోల్ పోషిస్తుంటే… హైదరాబాద్‌లో కృష్ణవేణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఇద్దరు మహిళలు కలిసి ఆరు నెలల కాలంలోనే 20 పసిపిల్లలను అమ్మవేశారు.. ఆంధ్ర, తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాల్లో 14 మంది బ్రోకర్లను పెట్టుకొని వీళ్ళు పిల్లల అమ్మకాలు కొనసాగిస్తున్నారు..

READ MORE: Annamalai: అప్పుడు “నోటా” పార్టీ అంటూ ఎగతాళి, ఇప్పుడు పొత్తుల కోసం ఆరాటం..

పొత్తిళ్లలో ఉన్న చిన్నారులను కొనుగోలు చేసి, రాష్ట్రాలు దాటించి విక్రయిస్తున్న కేసులో పరారీలో ఉన్న గుజరాత్‌ కిలేడీ వందనను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నగరంలో కింగ్‌పిన్‌గా వ్యహరిస్తున్న కృష్ణవేణితో పాటు.. ఆమెకు సహకరించిన మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. కృష్ణవేణికి, గుజరాత్‌ కేంద్రంగా చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న వందనకు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీస్‌ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానంలో రాచకొండ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితులను పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తే వారు ఎన్నేళ్లుగా చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే విషం తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు ఇంకా ఎంతమంది బ్రోకర్లు వందన దగ్గర పని చేస్తున్నారో తెలుస్తుందని అంటున్నారు.

READ MORE: Madhya Pradesh: భార్యని చంపి వ్యక్తి ఆత్మహత్య, మనవడి చితిలో దూకిన తాత..

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతమంది బ్రోకర్లను పెట్టుకొని ఆమె పిల్లల అమ్మకాలు కొనసాగిస్తుందో అనే విషయం బయట పడుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది చిన్నారులను కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు గుజరాత్లో ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రుల దగ్గర్నుంచి పిల్లలను లక్ష రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అలాంటి పిల్లలను ఇతర రాష్ట్రాలకు తరలించి తల్లి పిల్లలు పుట్టలేని వాళ్లకు ఐదు నుంచి పది లక్షలకు అమ్మి వేస్తున్నారు.

Subscribe for notification