Rachakonda police arrest gang selling babies

Written by RAJU

Published on:

  • పసి పిల్లలను అమ్ముతున్నారు జాగ్రత్త
  • ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
  • గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పిల్లల్ని తెచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించారు
  • ఒక్కొక్క పసికందును ఐదు నుంచి పది లక్షలకు అమ్ముతున్నట్లుగా వెల్లడించారు
Rachakonda police arrest gang selling babies

నేటి సమాజంలో డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈజీమని కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అడ్డదార్లు తొక్కుతున్నారు. దొంగతనాలు, దోపిడీలే కాదు పసిపిల్లలను అపహరించి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.10 మంది పసికందులను రక్షించారు.

Also Read:Exclusive : పూరి జగన్నాథ్ – సేతుపతి సినిమా నుండి పూరి కనెక్ట్స్ ఔట్

ముఠా సభ్యులు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పిల్లల్ని తెచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఒక్కొక్క పసికందును ఐదు నుంచి పది లక్షలకు అమ్ముతున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటికే పిల్లల అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన వందనను అరెస్టు చేశారు. గుజరాత్ కేంద్రంగా పిల్లల విక్రయాలకు పాల్పడుతున్న వందన. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో బ్రోకర్స్ ను పెట్టుకుని పిల్లల విక్రయాలకు పాల్పడుతోంది.

Subscribe for notification