R. Krishnaiah: ఆర్‌. కృష్ణయ్య వార్నింగ్.. ఆ భూములు విక్రయిస్తే అడ్డుకుంటాం

Written by RAJU

Published on:

– హెచ్‌సీయూ భూములు విక్రయిస్తే అడ్డుకుంటాం..

– వేలంలో ఎవరూ పాల్గొనొద్దు: ఆర్‌. కృష్ణయ్య

హైదరాబాద్: సెంట్రల్‌ యూనివర్సిటీ(Central University) భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు. భూముల విక్రయంపై ప్రధాని మోదీ(Prime Minister Modi)కి ఫిర్యాదు చేస్తామన్నారు. భూముల విక్రయాలను ఆపకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ వార్తను కూడా చదవండి: ORR: ఔటర్‌కు సర్వీసు రోడ్డు.. ఆర్‌ఓబీ నిర్మిస్తున్న రైల్వే అధికారులు

కాచిగూడలోని ఓ హోటల్‌లో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. గచ్చిబౌలి(Gachibowli)లో సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని,

city6.2.jpg

ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్‌, ఓయూ జేఏసీ చైర్మన్‌ రాజు, బీసీ సంఘాల నేతలు కోల జనార్దన్‌, నందగోపాల్‌, ఉదయ్‌, చెరుకు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Arjun Reddy: గ్రూప్‌-3 టాపర్లూ పురుషులే..

నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్‌ భూములు కావు

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం

మా సిఫారసు లేఖలు తీసుకోవాలి

Read Latest Telangana News and National News

Updated Date – Mar 15 , 2025 | 10:37 AM

Subscribe for notification