విశాఖపట్నం, మార్చి 21: విశాఖపట్నంలో ఓ సైకో తన చేష్టలతో ఇరుగు పొరుగు వారిని భయబ్రాంతులకు గురి చేశాడు. తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో చిత్తు కాగితాలకు నిప్పు పెటాడు. ఈ విషయాన్ని గమనించిన పొరుగు వారు.. అతడి ఇంట్లోకి వెళ్లి ఆ నిప్పును ఆర్పేందుకు యత్నించారు. ఆ క్రమంలో ఎవరైనా లోపలికి వస్తే.. గ్యాస్ సిలిండర్ తెరుస్తానంటూ వారిని బెదిరించాడు. దీంతో ఇరుగు పోరుగు వాళ్లు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో తనకు కుక్కను ఇస్తేనే.. బయటకు వస్తానంటూ పోలీసులకు సూచించాడు.
దాంతో ఎట్టకేలకు పోలీసులు చాకచక్యంగా సైకోను.. అతడి ఇంటిలో నుంచి బయటకు తీసుకు వచ్చారు. అతడికి మతి స్థిమితం లేని కారణంగా.. ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అదికాక నేవిలో అతడు పని చేసి రిటైర్డ్ అయ్యాడని పోలీసులు వివరించారు. అతడి పేరు సంతోష్ అని చెప్పారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాసపురంలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
Anchor Shyamala: శ్యామలకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు..
కొత్తిమీర రసం తాగితే ఇన్ని లాభాలా..?
Rains in AP: ప్రజలకు కూల్ న్యూస్
Viral News: య్యూటూబ్‌లో చూసి ఆపరేషన్ చేసుకున్నాడు.. ఆ తర్వాత..
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
Chiranjeevi: లండన్ పర్యటనలో చిరు.. వారిపై ఫైర్
For AndhraPradesh News And Telugu News
Updated Date – Mar 21 , 2025 | 08:34 PM