PSL 2025: త్రో బౌలింగ్ వేస్తున్నావ్.. పాక్ ప్లేయర్‌ను నిలదీసిన బ్యాటర్.. గ్రౌండ్‌లోనే డిష్యుం డిష్యుం.. వీడియో

Written by RAJU

Published on:


పాకిస్తాన్ సూపర్ లీగ్ 13వ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది . ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టులో కాలిన్ మున్రో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇంతలో, ఇఫ్తికార్ అహ్మద్ బౌలింగ్ చేయడానికి బంతిని అందుకున్నాడు .ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ మూడో బంతిని ఇఫ్తికార్ బ్లాక్‌హోల్‌లోకి వేయగా మున్రో దాన్ని విజయంవంతంగా అడ్డుకున్నాడు. అయితే ఇఫ్తికార్ చక్ (చట్టవిరుద్ధమైన బౌలింగ్ శైలి) చేస్తున్నాడని మున్రో ఆరోపించాడు. నిర్దేశించిన పరిమితికి మించి చేయి వంచుతున్నాడంటూ పాక్ బౌలర్ ను నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఇఫ్తికార్‌ మున్రో వైపు దూసుకెళ్లి ఏదో అన్నాడు. దీనికి మున్రో కూడా ధీటుగానే సమాధానం చెప్పాడు. చకింగ్‌ చేస్తున్నావని చెప్పడంలో తప్పేముందున్నట్లు ఇఫ్తికార్ ను నిలదీశాడు.

మున్రో, ఇఫ్తికార్ ల గొడవ జరుగుతుండగాన మధ్యలో సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ జోక్యం చేసుకున్నాడు. అతను కూడా మున్రోతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మైదానంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన అంపైర్లు జోక్యం చేసుకుని ఆటగాళ్లను సర్ది చెప్పారు.దీంతో పరిస్థితి సద్దు మణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా ఇంత జరిగాక కూడా ఇఫ్తికార్‌ అదే రకంగన బౌలింగ్‌ కొనసాగించాడు. దీంతో మున్రో చేసేదేమీ లేక బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే తన జట్టుకు మంచి శుభారంభం ఇచ్చి ఔటయ్యాడు. ఆండ్రియస్‌ గౌస్‌ (80 నాటౌట్‌) చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇస్లామాబాద్ యునైటెడ్ 17.1 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights