Prime Minister Modi’s key remarks on Gujarat riots..

Written by RAJU

Published on:

  • గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
  • లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్ కాస్ట్‌లో మాట్లాడిన ప్రధాని..
Prime Minister Modi’s key remarks on Gujarat riots..

PM Modi: 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దాడి, గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. గోద్రాలో 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడి “ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం” అని ఆయన అన్నారు. దీని తర్వాత జరిగిన అల్లర్లు ‘‘ప్రతీ ఒక్కరికి విషాదకరమైనవి’’గా చెప్పారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో ఒక్క అల్లరి కూడా జరగలేదని అన్నారు.

మూడు గంటల పాడ్‌కాస్ట్‌లో గుజరాత్ అల్లర్లనుంచి ఏం చేర్చుకున్నారని ప్రధానిని ప్రశ్నించిన నేపథ్యంలో, ప్రధాని మోడీ ఈ సంఘటనల గురించి చెప్పారు. ‘‘2001 అక్టోబర్ 07న గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్నాను, అప్పటికే గుజరాత్ భారీ భూకంపం నుంచి కోలుకుంటుంది, నాకు ప్రభుత్వ పాలన అనుభవం లేదు, ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర కూడా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో తాను సీఎం పదవిని చేపట్టాను’’ అని మోడీ చెప్పారు. 2002 ఫిబ్రవరి 24న తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, ఫిబ్రవరి 27న బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో గోద్రా అల్లర్లు జరిగిన విషయాన్ని మోడీ వెల్లడించారు.

Read Also: Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ హతం..? పాక్ ఎస్ఎంలో వైరల్ న్యూస్..

ఇది ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం, ప్రజల్ని సజీవ దహనం చేశారని ప్రధాని మోడీ అన్నారు. అల్లర్లకు ముందు 12-15 నెలల్లో జరిగిన సంఘటనలను మోడీ వివరించారు. ‘‘ 1999 డిసెంబర్ 24న కాందహార్ హైజాక్ అయింది, 2000లో ఢిల్లీ ఎర్రకోటపై దాడి జరిగింది. 2001లో అమెరికా ట్విన్ టవర్స్‌పై అటాక్, 2001లో జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీపై దాడి, డిసెంబర్ 13 పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఈ సంఘటనలు దేశంలో ఉద్రిక్తతల్ని పెంచాయి’’ అని మోడీ చెప్పారు.

2002 గుజరాత్ అల్లర్లు అతిపెద్దవి కాదని, 2002కి ముందు గుజరాత్‌లో అనేక అల్లర్లు జరిగాయి. 250కి పైగా పెద్ద అల్లర్లు జరిగాయని, 1969లో 6 నెలల పాటు అల్లర్లు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. 2002 నుంచి గుజరాత్‌లో ఒక్క అల్లరి జరగలేదని మోడీ చెప్పారు. మేము రాజకీయ లబ్ధి కోసం పనిచేయడం మానేశామని, బుజ్జగింపు రాజకీయాల స్థానంలో ఆశయాల రాజకీయాలను తెచ్చామని ప్రధాని అన్నారు.

Subscribe for notification