
Preity Zinta: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతుందని చెప్పవచ్చు. ప్లేఆప్స్ కోసం ప్రతి జట్టు నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఆడుతూ విజయాలు సాధిస్తున్నాయి. ఇకపోతే, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో తన భర్త జీన్ గూడెనఫ్ తో కలిసి చిల్ అవుతుంది. ‘మండే మూడ్’ (Monday Mood) అంటూ ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై ఫ్యాన్స్ రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
ఐపీఎల్ ని వదిలి భర్తతో రోమాన్స్ చేస్తున్నావా..? అంటూ కొందరు ట్రోల్స్ చేస్తుండగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఐపీఎల్ స్ట్రెస్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఐపీఎల్ లో ప్రీతీ జింటా రూటే సపరేటు. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తుంది. అరంగేట్ర ఐపీఎల్ సీజన్ నుంచి పంజాబ్ మ్యాచ్‌లకు హాజరవుతున్న ప్రీతీ తన అందంతో పాటు టీంకు సపోర్ట్ గా కూడా ఆటగాళ్లలో జోష్ నింపుతుంది. ఒక్కోసారి సంతోషాన్ని తట్టుకోలేక ఆటగాళ్లను ముద్దులతో, హాగ్ లతో ముంచెత్తుతుంది. ఓ వైపు ఫ్లయింగ్ కిస్స్‌లు, మ్యాచ్ అనంతరం ప్లేయర్స్ కిచ్చే ముద్దులతో, హగ్స్ తో ప్రేక్షకులను రెచ్చగొడుతూ ఉంటుంది.
అలాగే స్టేడియం అంతా తిరుగుతూ తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటుంది. ఈ సీజన్లో పంజాబ్ కొత్త కెప్టెన్ పుణ్యమా అంటూ అదరగొడుతుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 5 గెలిచి మూడు ఓడింది. మరో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ పోరులో నిలవాలంటే ఇంకా కష్టపడల్సి ఉంది. ఇప్పటికే సగం మ్యాచులు పూర్తయ్యాయి.ప్లేఆప్ రేసుపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. టైటిల్ పోరులో నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. ఢిల్లీపై గెలిచిన ఆర్సీబీ టాప్ పొజిషన్ కి దూసుకెళ్లింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఉన్నాయి. ఐదో స్థానంలో పంజాబ్ కొనసాగుతుంది. చూడాలి మరి ఈ రేసు ఇంకా ఎంత రసవత్తరంగా సాగుతుందో.