Pre Work out Black Espresso: రోజు కసరత్తు చేస్తారా? ఎక్సర్‌సైజుకు ముందు బ్లాక్ కాఫీ తాగితే డబుల్ బెనిఫిట్స్!

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: కాఫీ అంటే కేవలం ఉదయాన్నే ఉత్సాహం కోసం తాగే పానీయం కాదు. కసరత్తులకు ముందు దీన్ని తాగితే అదనపు ప్రయోజనాలు అనేకం ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో, కాఫీని జిమ్‌‌కు వెళ్లే ముందు ఎందుకు తాగాలో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.

కసరత్తుల ముందు ఉత్సాహం కోసం తాగాల్సి డ్రింక్స్ మార్కెట్లో అనేకం ఉన్నాయి. అయితే, ఎక్కువ మంది ఫిట్‌నెస్ లవర్స్ ఎంచుకునేది మాత్రం బ్లాక్ కాఫీనే. అందుబాటు ధరల్లో ఉండే సహజసిద్ధంగా ఉత్సాహం పెంచే కెఫీన్‌కు ప్రత్యామ్నాయం లేదనేది కొందరు చెప్పే మాట. కసరత్తుల ముందు ఉత్సాహం ఇవ్వడంతో పాటు కసరత్తుల ప్రభావశీలతను కూడా బ్లాక్ కాఫీ పెంచుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు (Health).

High BP Myths: హైబీపీ.. ప్రజల్లో అపోహలు.. వాస్తవాలు!

శరీరంలో ఉత్సాహం కలుగజేసే కెఫీన్‌‌తో పాటు, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ అనేకం కాఫీలో ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది తాగే పానీయాల్లో కాఫీ ముందుంటుంది. కసరత్తుల ముందు బ్లాక్ కాఫీ తాగితే కండరాల శక్తి, ఎక్కువ సేపు కసరత్తులు చేసే సామర్థ్యం, దేహదారుఢ్యం పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎయిరోబిక్ ఎక్సర్‌సైజుల ప్రభావశీలత పెరుగుతుందని తెలిపారు. ఎక్కువ దూరం పరిగెత్తడం, దూకడం వంటివి సాధ్యమవుతాయని అన్నారు. గ్లైకోజన్ అనే చక్కెర, కొవ్వు వినియోగాన్ని శారీరక అవసరాలకు తగిన విధంగా చక్కదిద్దుతుంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకే కాకుండా సాధారణంగా జిమ్‌లో కసరత్తులు చేసే వారికి కూడా బ్లాక్ కాఫీతో ఎంతో మేలని అధ్యయనాల్లో తేలింది.

జిమ్‌కు వెళ్లే ముందు బ్లాక్ కాఫీ తాగితే అందులోని కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థను క్రియాశీలకం చేస్తుంది. అలసట తగ్గించి భారీ కసరత్తులకు అనువుగా శరీరాన్ని రెడీ చేస్తుంది. ఉత్సాహంగా ఎక్సర్‌సైజులు మొదలు పెడితే మరిన్న ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రేత్తలు ఎప్పుడో చెప్పారు. కెఫీన్‌ వల్ల ఏకాగ్రత, మూడు బాగుపడి కసరత్తులు మరింత ఉత్సాహంగా చేస్తారు.

Calories burned in Cricket: వామ్మో.. క్రికెట్ ఆడితే ఇన్ని కెలరీలు ఖర్చవుతాయా

కండరాల పనితీరును కెఫీన్ మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఎక్కువ బరువులు ఎత్తడం లేదా ఎక్కువ సేపు కసరత్తులు చేయడం సాధ్యమవుతుంది. వర్క్‌అవుట్స్ కారణంగా అలసిపోవడం కూడా తగ్గుతుంది. ఇక అథ్లెట్లలో కెఫీన్ కారణంగా అడ్రనలిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరిగి మెరుగైన ప్రదర్శన ఇస్తారని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీవ్ర శారీరక, మానసిక శ్రమలకు అనుకూలంగా శరీరాన్ని అడ్రనలిన్ హార్మన్ సిద్ధం చేస్తుంది. జీవక్రియల వేగం పెంచి కొవ్వులు అధికంగా కరిగేలా చేస్తుంది. డోపమైన్ ఉత్పత్తిని పెంచి ఉత్సాహం, సంతోషం రెట్టింపయ్యేలా చేస్తుంది.ఇక తరకూ కాఫీ తాగే వారిలో ఫ్యాటీ లివర్, సిర్రోసిస్, హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని తేలింది. ఇక శరీరంలోని విషతుల్యాలను లివర్ తొలగించేందుకు కూడా సాయపడుతుంది. కాబట్టి, కసరత్తులకు ముందుకు బ్లాక్ కాఫీకి మించిన ప్రీ వర్కవుట్ బూస్టర్ లేదని అంటున్నారు.

Read Latest and Health News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights