సీఐడీ కేసు..
టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు కూడా పోసానిపై కేసు నమోదు చేశారు. 2024 సెప్టెంబర్ నెలలో ఓ మీడియా సమావేశంలో చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు