Posani Bail Granted: పోసాని కృష్ణ మురళికి బెయిల్.. ఇప్పుడైన బయటకు వస్తారా

Written by RAJU

Published on:

గుంటూరు, మార్చి 21: వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి (YSRCP Leader Posani Krishan Murali) ఊరట లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

గతంలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వైసీపీ నేత మూడు సార్లు అరెస్ట్ అయి రిమాండ్ విధించగా.. మూడు సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వస్తారని అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా సీఐడీ పీటీ వారెంట్ వేసి పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. అందులో భాగంగా గుంటూరు కోర్టు ఆయనకు ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. అంతే కాకుండా ఒకరోజు సీఐడీ కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది.

SRH IPL 2025 Tickets: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచులు.. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే..

ఇప్పుడు తాజాగా గుంటూరు సీఐడీ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్రంలో పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌‌తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా లేక బెయిల్‌పై విడుదల అవుతారా అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు (శనివారం) ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే

Operation Garuda AP: ఏపీలో ఆపరేషన్ గరుడ.. ఖంగుతిన్న మెడికల్‌షాప్ యజమానులు

Read Latest AP News And Telugu News

Updated Date – Mar 21 , 2025 | 05:05 PM

Subscribe for notification