Pores and skin Care: మెరిసే చర్మం కోసం ఫేస్ క్రీములు అక్కర్లేదు.. నీళ్లు ఇలా తాగి చూడండి..

Written by RAJU

Published on:

నీరు ప్రాణకోటి జీవనానికి అవసరం. మనిషి శరీరంలో 70శాతం నీరు ఉంటుందని అంటారు. ప్రతిరోజూ శరీరానికి కావలసినంత నీరు తాగకపోతే శరీర వ్యవస్థ సరిగా పనిచేయదు. శరీరంలో అవయవాలతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండటంలో కూడా నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అందంగా కనిపించాలంటే నీరు తగినంత తాగడం అవసరం అని అంటున్నారు. అసలు నీరు చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించడంలో చేసే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుంటే..

కార్తీక మాసంలో తులసి కోట దగ్గర రోజూ ఈ దీపం పెడుతుంటే లక్ష్మీ కటాక్షం ఖాయం..

నీరు శరీరాన్ని హైడ్రేటెట్ గా ఉంచుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. హైడ్రేటెట్ గా ఉండటం అంటే శరీర విధులకు సరిపడినంత నీరు శరీరంలో ఉండటం. క్రమం తప్పకుండా నీటిని తాగుతూ ఉంటే శరీరంలో అవయవాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటే చర్మం కూడా ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

శరీరంలో తగినంత నీరు లేకపోతే శరీరం పొడిబారుతుంది. దీని వల్ల దురదలు, దద్దుర్లు, చర్మ సంబంధ ఇతర సమస్యలు వస్తాయి. చల్లని వాతావరణంలో చర్మం తీవ్ర నష్టానికి లోనవుతుంది. అవి రాకుండా ఉండాలంటే నీరు బాగా తీసుకోవాలి.

శరీరంలో టాక్సిన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని కలుషితం చేస్తాయి. నీటిని పుష్కలంగా తాగుతుంటే చెమట, మూత్రం రూపంలో శరీరంలో టాక్సిన్లను పంపేస్తుంది. ఈ టాక్సిన్లు బయటకు వెళ్లిపోతే రక్తం, చర్మం కూడా శుభ్రంగా ఉంటాయి. ఇవి చర్మం మెరిచేలా చేస్తాయి.

భారతదేశంలో అత్యంత అందమైన లక్ష్మీదేవి ఆలయాల గురించి తెలుసా..

వయసు పెరిగేకొద్ది చర్మం పైన ముడతలు రావడం సహజం. కానీ రోజూ శరీరానికి కావలసినంత నీరు తాగుతూ ఉంటే ఈ ముడతలను ఆలస్యం చేయవచ్చు. చర్మం హైడ్రేట్ గా, బిగుతుగా ఉంటే ముడతలు రావు.

నీరు బాగా తాగుతూ ఉంటే రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు దారి తీస్తుంది. ఇది చర్మాన్ని మెరుగు పరుస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు లేదా 2 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఉదయాన్నే పరగడుపున తాగడమే కాకుండా అల్పాహారం, లంచ్, డిన్నర్ మధ్యలో పలు సార్లు నీటిని తాగుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తుంటే చర్మం మెరుస్తూ ఉండటం పెద్ద కష్టం కాదు.

ఇవి కూడా చదవండి..

ఈ ఆహారాలు తినండి చాలు.. ముఖం మీద ముడతలు మాయం..

ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights